KBC : రేవంత్‌రెడ్డి పై 'KBC' లో అబితాబ్‌ ప్రశ్న.. దిక్కులు చూసిన యువతి..!

అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్నKBC గేమ్ షోలో CM రేవంత్ రెడ్డి పై ప్రశ్న అడిగారు. షోలో పాల్గొన్నయువతిని రేవంత్ రెడ్డి ఏ స్టేట్ CMగా ప్రమాణ స్వీకారం చేశారని అడిగారు. ఈ ప్రశ్నకు ఆలోచనలో పడిపోయిన యువతి ఆడియన్స్ పోల్ సహాయంతో సరైన ఆన్సర్ చేసింది.

New Update
KBC : రేవంత్‌రెడ్డి పై 'KBC' లో అబితాబ్‌ ప్రశ్న.. దిక్కులు చూసిన యువతి..!

KBC : 'కౌన్ బనేగా కరోడ్ పతి' (Kaun Banega Crorepati) బాలీవుడ్ టెలివిజన్ గేమ్ షో. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఈ షోను నిర్వహిస్తున్నారు. 2001 లో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే 14 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ షోలో 1-15 ప్రశ్నలు ఉంటాయి. 10,000 నుంచి మొదలు పెట్టి కోటి రూపాయల వరకు ప్రశ్న విలువ పెరుగుతూనే ఉంటుంది. మనీ పెరిగే కొద్దీ టెన్షన్ కూడా ఎక్కువవుతుంది. ప్రతీ ప్రశ్న చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. కొన్ని సార్లు తెలిసిన సమాధానాలు కూడా సందేహాన్ని కలిగిస్తాయి.

Also Read: Guntur Kaaram Song : ఇంత రోత పనికిరాదు భయ్యా..”కుర్చీ మడతపెట్టి” ప్రోమో పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్

అయితే తాజాగా ఈ నెల 15 న ప్రసారమైన కౌన్ బనేగా కరోడ్ పతి షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గురించి ప్రశ్న అడిగారు. షోలో (KBC) పాల్గొన్న యువతిని 40 వేల ప్రశ్నగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని అడిగారు. దీనికి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ (Telangana), మధ్యప్రదేశ్‌, ఆంధప్రదేశ్‌ అని ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన యువతీ.. ఆలోచనలో పడిపోయింది. దీంతో ఆ అమ్మాయి లైఫ్ లైన్ సహాయం కోరింది. లైఫ్ లైన్ లో భాగంగా 50:50, ఆడియన్స్ పోల్, వీడియో కాల్ ఆప్షన్లు ఉంటాయి. ఆడియన్స్ పోల్ కోరగా.. ఎక్కువ మంది ప్రేక్షకులు తెలంగాణ ఆప్షన్ సూచించారు. ఆ సమాధానం సరైనది కావడంతో.. 40 వేలు గెలుచుకొని నెక్స్ట్ ప్రశ్నకు అర్హత సాధించింది. తెలుగులో కూడా ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ప్రసారమైంది. ఈ షోకు నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.

Also Read: Ravi Teja Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ షూట్ బిగిన్స్.. మరో సారి మాస్ కాంబో రిపీట్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు