AP: వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. ఏకంగా సర్పంచ్ తల నరుకుతానంటూ బెదిరింపులు!

ఎన్టీఆర్ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. త్రినాథ్ వర్గం నేతలు తమను తల నరికి చంపుతామని బెదిరిస్తున్నారని పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు సర్పంచ్ బోజండ్ల జ్యోతి-బ్రహ్మం దంపతులు ఆరోపిస్తుండడం చర్చనీయాంశమైంది.

New Update
AP: వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. ఏకంగా సర్పంచ్ తల నరుకుతానంటూ బెదిరింపులు!

మరో సారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికార వైసీపీకి అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు చోట్ల సీట్ల కోసం పలువురు నాయకులు బాహాబాహికి దిగి మాటల దాడి చేసుకుంటుండగా.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ఆనిగండ్లపాడు గ్రామంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆనిగండ్లపాడు గ్రామ సర్పంచ్ బోజండ్ల జ్యోతి భర్త బ్రహ్మానికి సంబంధించిన లారీని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. అంతేకాదు అతని వరి కోత మిషన్ డీజిల్ ట్యాంకులో ఇసుకపోసిన నానా హంగామా సృష్టించారు.

త్రినాథ్ వర్గం బెదిరింపులు..

ఈ క్రమంలోనే తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన సర్పంచ్ జ్యోతి-బ్రహ్మం దంపతులు సొంతపార్టీ నేలతపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత వారం రోజుల నుంచి వైసీపీకి చెందిన త్రినాథ్ వర్గం తమను చంపుతానని బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి : Hyderabad: మల్లారెడ్డి మమ్ములను ముంచిండు.. ప్రజావాణిలో 700 మంది బాధితుల ఫిర్యాదు

కులం పేరుతో దూషణలు..

ఇక ప్రభుత్వ మద్యం దుకాణంలో రూ. 33 లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడ్డట్టు బోశెట్టి త్రినాథ్ పై పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. కాగా ఈ అక్రమ మద్యం కేసులో పోశెట్టి త్రినాథ్ కు తాము వ్యతిరేకంగా వ్యవహరించామనే నేపథ్యంలో వైరం పెంచుకుని తమను నష్టపరిచేందుకు లారీకి నిప్పు పెట్టారని సర్పంచ్ భర్త బ్రహ్మం ఆరోపిస్తున్నారు. తాను ఎస్టీ కులానికి చెందిన మహిళ కావడంతో త్రినాథ్ కులం పేరుతో దూషించి అవమానపరిచాడని సర్పంచ్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు తన భర్త బ్రహ్మానికి ఫోన్ చేసి జనవరి పదో తారీకు నాటికి తల మొండెం వేరు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డట్టు సర్పంచ్ జ్యోతి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. పార్టీ వీరి వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు- 14 రోజులు అక్కడే

అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అదే సమయంలో అఘోరీ నుంచి వర్షిణీని వేరు చేసి భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

New Update

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

14 రోజుల రిమాండ్

విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు.  కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

కేసు ఏంటంటే?

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .

క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

aghori Arrest | lady aghori arrest | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment