PV Narasimha Rao: ఆర్ధిక మంత్రం.. విదేశీ విధాన తంత్రం.. ఇదే పీవీ చాణక్యం 

మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు భారతరత్న ప్రకటించింది ప్రభుత్వం. అనూహ్య పరిస్థితుల్లో..ఆర్ధిక గందరగోళం..రాజకీయ స్థబ్ధత మధ్య ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పట్టాలెక్కించారో..విదేశీ విధానాన్ని ఎలా చక్కదిద్దారో  ఈ కథనంలో తెలుసుకోవచ్చు

New Update
PV Narasimha Rao: ఆర్ధిక మంత్రం.. విదేశీ విధాన తంత్రం.. ఇదే పీవీ చాణక్యం 

PV Narasimha Rao Profile: రాజకీయం అంటే ఓట్ల కోసం.. పదవుల కోసం అని ఇప్పుడు మనం అనుకుంటాం. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. కానీ.. ప్రజా సంక్షేమం కోసం కూడా రాజకీయాలు ఉపయోగపడాలి. రాజకీయ నాయకులుగా ఉన్నవారు.. ప్రజల కోసం ఏమి చేయగలమో అనే విషయాన్ని   ఆలోచిస్తూనే ఉండాలి. ఒక పార్టీలో నాయకుడిగా ఉన్నపుడు ఆ పార్టీ విధానాలను సమర్థిస్తూనే.. ప్రజల బాగోగుల విషయంలో పార్టీ లైన్ దాటి కూడా పనిచేయడానికి వెనుకాడకూడదు. ఇప్పుడు ఇలా ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎవరైనా ఉన్నారా? చెప్పలేం. కానీ.. మన ఉమ్మడి తెలుగురాష్ట్రాలకు సంబంధించి అలాంటి నాయకుడు ఒకరున్నారు. విద్యావేత్తగా.. పండితుడిగా.. రాజకీయనాయకుడిగా.. ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రధాన మంత్రి వరకూ వివిధ స్థాయిల్లో ఉన్నత పదవుల్లో ఒదిగి.. ఆ పదవులకు వెలుగు ఇచ్చిన నాయకుడు ఆయన. ఆయనే పీవీ నర్సింహారావు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం.. ప్రజలకు.. దేశానికి మేలు చేస్తుంది అంటే.. దానిని ఎటువంటి అవాంతరాలు ఎదురైనా తప్పనిసరిగా చేయడం ఆయన నైజం. తనకు ఇష్టం లేని పరిస్థితి ఎదురైతే మౌనంగా పక్కకు జరగడం.. మీరు తప్పితే ఎవరూ లేరు అంటే.. ఆ బాధ్యతను ఇష్టం లేకపోయినా స్వీకరించి ప్రజల మన్ననలు పొందేలా పనిచేయడం పీవీ గొప్పతనం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న (Bharat Ratna Award) ప్రకటించారు. రాజకీయాల మాట ఎలా ఉన్నా.. భారతరత్న పురస్కారానికి అన్నివిధాలుగానూ అర్హులైనవారు పీవీ. ఇప్పటి ఆర్ధిక అభివృద్ధి వెనుక ఉన్న శక్తి పీవీ నర్సింహారావు అనేది ఇప్పటి తరానికి తెలియదు. అందుకే.. పీవీనర్సింహారావు దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి పరిస్థితుల్లో ఆయన(PV Narasimha Rao) దేశానికి చేసిన మేలు ఏమిటనేది ఒకసారి చెప్పుకుందాం. 

అనూహ్యంగా... 
పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతగా ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా (AP CM) వ్యవహరించారు. తరువాత కేంద్రమంత్రిగా చాలాకాలం ఉన్నారు. 1990 సమయంలో పీవీ నర్సింహారావు కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు. 1991లో ఎన్నికల సమయంలో దురదృష్టవశాత్తూ రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) ఎవరిని ప్రధానిగా చేయాలి అనే పెద్ద సమస్య తలెత్తింది. అప్పుడు అనూహ్యంగా.. పీవీ నరసింహారావును ఎంపిక చేశారు సోనియా గాంధీ. రాజకీయాల నుంచి పక్కకు జరగాలని అనుకున్న పీవీ నర్సింహారావు తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రధాని కావాల్సి వచ్చింది. 

గందరగోళ పరిస్థితులు..
పీవీ ప్రధానిగా (Prime Minister) బాధ్యతలు స్వీకరించే సమయానికి దేశ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇటు రాజకీయంగానూ.. అటు ఆర్థికంగానూ కూడా దేశ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఒక పక్క గల్ఫ్ యుద్ధ మేఘాలు.. మరోపక్క టెర్రరిజం.. ఒకవైపు అప్పుల కుప్ప.. మరోవైపు అగమ్యగోచరంగా ఉన్న రాజకీయ పరిస్థితులు. ఇలాంటి సమయంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా నిలదొక్కుకోగలుగుతారా? అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర మొదటి ప్రధానిగా ఆయన ఎలా పార్టీ నుంచి వచ్చే ఒత్తిడులను తట్టుకుంటారు? ఎలాంటి అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లోనే కాదు.. సామాన్య ప్రజల్లో కూడా ఉండేవి. కానీ.. ఆయన పీవీ.. అవును.. చాణక్య నీతిని ఔపోసన పట్టిన నాయకుడు. అపర చాణుక్యుడిలా ఐదేళ్ల పాటు దేశాన్ని ఓక గాడిలో పెట్టడానికి మౌనంగానే పనిచేశారు. మాటలు తక్కువ.. పని ఎక్కువ. ఆయనకు తోడుగా ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను (Manmohan Singh) ఎంపిక చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థకు మరమత్తులు మొదలు పెట్టారు. సరికొత్త భారత ఆర్థిక వ్యవస్థకు (Indian Economy) శ్రీకారం చుట్టారు. 

ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే..
పీవీ ప్రధానిగా (PV Narasimha Rao)వచ్చేసరికి ప్రపంచంలోనే ఎక్కువ అప్పులతో ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది భారత్. దాదాపుగా 72 బిలియన్ డాలర్ల విదేశీ అప్పుల భారం భారత్ పై వేలాడుతోంది. ఎంతటి హీనమైన పరిస్థితి ఉండేదంటే.. ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి.. ఏదేశమూ మనకు అప్పు ఇవ్వని స్థితి. ఆఖరుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్  స్విట్జర్లాండ్‌లలో 67 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి 607 మిలియన్ డాలర్ల అప్పు తెచ్చుకున్న దుస్థితి. అటువంటి పరిస్థితిని చాలా వేగంగా మార్చారు పీవీ. మన్మోహన్ సింగ్ తోడుగా అద్భుతాలే చేశారు. దేశ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న.. లైసెన్స్ ల విధానాన్ని సమూలంగా మార్చేశారు. విదేశీ వ్యాపారం సులభతరం అయింది.  దీంతో 1992 కల్లా దేశ ఆర్థిక పరిస్థితి పట్టాలెక్కింది. పీవీ మార్కు ఏమిటి అని చెప్పాలంటే.. 1995లో ఆయన ప్రధానిగా తప్పుకునే నాటికి దేశ జీడీపీ వృద్ధి 7.6 శాతానికి చేరుకుంది. ఇదొక్కటి చాలు పీవీ దేశానికి ఎంత మేలు చేశారో చెప్పటానికి. పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి మన జీడీపీ సుమారు 26 వేళా కోట్ల డయలర్లుగా ఉండేది. అది 2021 నాటికి సుమారు మూడు లక్షల కోట్ల డాలర్లు దాటింది. ఇంత వేగంగా దేశం వృద్ధిని సాధించడానికి పీవీ ఆర్ధిక సంస్కరణలే మూలం అని చెప్పొచ్చు. 

Also Read: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న!

ఇప్పుడు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్.. శాటిలైట్ టీవీలు.. మనం వాడుతున్న అపరిమిత ఇంటర్నెట్.. ఇప్పటి తరానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల ఉపాధి ఇస్తున్న ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు పీవీ హయాంలో వేసిన ఆర్థిక మూలాల నుంచి ఎదిగినవే.  అభివృద్ధి పేరుతొ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోకూడదనేది పీవీ నర్సింహారావు గట్టి మాట. ఇప్పుడు మనం చూస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకానికి అప్పట్లో పీవీ వేసిన పునాదులే కీలకం. అప్పట్లో సంవత్సరంలో 100 రోజుల పని గ్యారెంటీ పథకానికి ఆయనే రూపకర్త. 

విదేశాంగ విధానంలోనూ..
ఆర్థిక రంగంలోనే కాదు.. విదేశీ విధానంలోనూ పీవీ అప్పట్లో వేసిన ముద్ర చెరిగిపోనిది. ఆయన రాజనీతి విదేశీ విధానంలో అద్భుత ఫలితాలు ఇచ్చింది. లుక్ ఈస్ట్ (Look East) అనే విధానాన్ని తీసుకువచ్చిన పీవీ.. దానితో చైనాకు చెక్ పెట్టె ప్రయత్నం చేశారు. మన దేశంవైపు అందరూ చూసేలా చేశారు. భారత దేశానికి కొత్త మిత్రులను తీసుకువచ్చారు పీవీ. ఇజ్రాయెల్ (Israel) తో స్నేహం కోసం టెల్ అవీల్ లో భారత రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ కి మిత్ర దేశంగా ఉన్న ఇరాన్ తో స్నేహబంధాన్ని ఏర్పాటు చేయడంలో పీవీదే కీలక పాత్ర. భారత దేశాన్ని అణ్వస్త్ర దేశంగా మార్చడంలో పీవీ విధానాలే ముఖ్యమైనవి. చైనా, పాకిస్తాన్ లకు గట్టి చెక్ పెట్టాలంటే అణు కార్యక్రమం భారత్ లో కొనసాగాలని ప్రయత్నాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకా వాజపేయి (Vajpayee) ప్రధానిగా ఉన్నపుడు అణుపరీక్షలు జరిగాయి. ఆ సందర్భంలో పరీక్షలు చేస్తున్నది మేమైనా.. దీని వెనుక శక్తి మాత్రం పీవీ నర్సింహారావే అని వాజ్ పేయీ చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. పీవీ ప్రధానిగా ఉండగా ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరిగాయి. దానికి భారత్ నుంచి ప్రతినిధిగా ప్రతిపక్షనేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయిని పంపించి కొత్త చరిత్ర సృష్టించారు పీవీ. 

వ్యక్తిగతంగా ఏ మచ్చాలేని నేత..
పీవీ నర్సింహారావు ఎన్నో పదవులు అలంకరించారు. కానీ.. ఎక్కడా వ్యక్తిగతంగా ఆయనపై మచ్చ పడలేదు. పడనీయలేదు. ఆయన ఆస్తులే తిరిగిపోయాయి తప్ప.. ఎక్కడా ఆయన రాజకేయాల పేరు చెప్పి లేదా.. దేశ నేతగా ఆస్తులు కూడపెట్టుకున్న దాఖలాలు లేవు. ప్రధానిగా దిగిపోయిన తరువాత రాజకీయంగా ఆయనపై బురద జల్లే కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని కేసులు కూడా ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ సొంత డబ్బుతో ఎదుర్కొన్నారు. ఏ కేసూ నిలబడలేదు. సరికదా ఆయనకు ప్రతి కేసులోనూ క్లీన్ చిట్ ఇచ్చాయి కోర్టులు. ఆ కోర్టు కేసుల కోసం తమ న్యాయవాదులకు హైదరాబాద్ లో ఉన్న ఇంటిని అమ్మి డబ్బు చెల్లించారు పీవీ. 

పీవీ జీవితం నుంచి ఇప్పటితరం రాజకీయనాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పీవీ నర్సింహారావు దార్శనికతే.. మన దేశ అభివృద్ధికి కీలకంగా ఉందనే విషయం చాలా స్పష్టం. అందుకే భారతరత్న అవార్డును ఆయనకు ప్రకటించడం కచ్చితంగా సబబే. ఇది తెలుగు జాతికి దక్కిన అపురూప గౌరవంగా చెప్పుకోవచ్చు. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴IPL 2025 DC vs RR Live Score: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
DC vs RR Live Score IPL 2025

DC vs RR Live Score IPL 2025

RR vs DC : టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

dc-vs-rr
dc-vs-rr

 

ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

  • Apr 16, 2025 19:55 IST

    IPL 2025 DC vs RR Live Score: డిల్లీ రెండో వికెట్ డౌన్.. కరుణ్‌ నాయర్ డకౌట్.. 


    సందీప్ శర్మ వేసిన నాలుగో ఓవర్‌లో కరుణ్‌ నాయర్ రనౌట్‌



  • Apr 16, 2025 19:45 IST

    IPL 2025 DC vs RR Live Score: డిల్లీ ఫస్ట్ వికెట్ డౌన్

    జేక్ ఫ్రేజర్ (9) ఔట్.. 



  • Apr 16, 2025 19:40 IST

    IPL 2025 DC vs RR Live Score: తుషార్ దేశ్‌పాండే వేసిన  రెండో ఓవర్లో 23 పరుగులు 

    వరుస బౌండరీలతో హోరెత్తించిన పొరెల్
    జేక్ ఫ్రేజర్(9), అభిషేక్ పొరెల్(24)
    స్కోరు 33/0



  • Apr 16, 2025 19:38 IST

    IPL 2025 DC vs RR Live Score: జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లోనే పది పరుగులు 

    జేక్ ఫ్రేజర్(9), అభిషేక్ పొరెల్(1)



  • Apr 16, 2025 19:20 IST

    IPL 2025 DC vs RR Live Score



  • Apr 16, 2025 19:19 IST

    IPL 2025 DC vs RR Live Score



  • Apr 16, 2025 19:08 IST

    RR vs DC : టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

    ఐపీఎల్ 2025లో భాగంగా..  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.  

    dc-vs-rr
    dc-vs-rr

     



  • Apr 16, 2025 14:19 IST

    ఇక 40 ఏళ్లు వస్తే ఉద్యోగం ఊస్ట్.. షాకింగ్ ప్రకటన!

    ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో లేఆఫ్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.దీనిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్ పాండే స్పందించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO
    Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO

     



  • Apr 16, 2025 14:18 IST

    ఉర్దూ ఇండియాలోనే పుట్టింది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    సైన్‌బోర్డులకు ఉర్దూ భాష వాడటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఓ మున్సిపల్ కౌన్సిల్‌కు ఉర్దూ భాషలో రాసిన సైన్‌ బోర్డుకు ఉండటాన్ని సమర్ధించింది.కేవలం మరాఠీ మాత్రమే వాడాలన్న వాదనను తిరస్కరించింది. ఉర్దూ ఇండియాలోనే పుట్టిందని తెలిపింది.

    Supreme Court
    Supreme Court

     



  • Apr 16, 2025 13:16 IST

    ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

    ఐపీఎల్ సీజన్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఆటగాళ్లను హైదరాబాద్ వ్యాపారి సంప్రదిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ భద్రతా విభాగం (ACSU) 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా తమను సంప్రదిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. 

    list



  • Apr 16, 2025 11:28 IST

    రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

    రీల్స్ పిచ్చితో ఓ మహిళ గంగానదిలో కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం గంగానదిలో దిగగా.. కాలు జారింది. ఇదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుని మృతి చెందింది. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు.

    viral video up
    viral video up

     



  • Apr 16, 2025 09:34 IST

    హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

    హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

    ed



  • Apr 16, 2025 09:20 IST

    షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారంట్లు జారీ చేసింది.

    sheikh Hasina
    sheikh Hasina

     



  • Apr 16, 2025 09:19 IST

    ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

    ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

    EC



  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment