మామకు మద్దతుగా పాలిటిక్స్ లోకి పుష్ప రాజ్..! మామ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బన్నీ ఆయనకు మద్దుతు తెలిపారు. అయితే ఈ సారి పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కోసం అల్లుఅర్జున్ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. By P. Sonika Chandra 08 Aug 2023 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్ క్యూకట్టింది. అయితే ఈ సారి తెలంగాణ రాజకీయం బాగా హీటెక్కిన క్రమంలో అధికార ప్రతిపక్షాలు గెలుపు గుర్రాల వేటను కొనసాగిస్తూనే.. కొన్ని చోట్ల సినీ తారతో ఆ సీట్లను తమ ఖాతాలోకి వేసుకోవడానికి గట్టిగా స్కెచ్ వేస్తున్నారు. ఇక ఈ క్రమంలో పుష్ప మూవీతో తగ్గేదేలే అంటూ.. ప్యాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటుకున్న ఐకాన్ సార్ట్ అల్లు అర్జున్ కూడా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. మామ కోసం అల్లుడు రంగంలోకి.. మామ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బన్నీ ఆయనకు మద్దుతు తెలిపారు. అయితే ఈ సారి పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కోసం అల్లుఅర్జున్ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. బన్నీ భార్య స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అధికార పక్షంలో బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఆయన స్వస్థలం..నల్లగొండ జిల్లాలోని పెద్దపూర మండలం చింతపల్లి. 2014 లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ గా పోటీలోకి దిగి ఆయన ఓడిపోయారు. అయితే అప్పుడు కూడా బన్నీ మామ కోసం క్యాంపెయింగ్ చేశాడు. కాని వర్కౌట్ కాలేదు. ఇక ఈ సారి రానున్న ఎన్నికల్లో మరోసారి లక్ ను పరీక్షించుకోవడానికి ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. నాగార్జున సాగర్ నుంచి ఈ సారి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందా.. లాస్ట్ టైమ్.. ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. ఈసారి నాగార్జునా సాగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీని కోసం ఆయన ఇప్పటికే కంచర్ల ఫౌండేషన్ పేరుతో సేవాకార్యక్రమాలను పెంచారు. ఈ నెల 19 నుంచి నియోజకవర్గంలో కార్యకలాపాలను పెంచాలనుకుంటున్నారు. దీని కోసం పెద్దపూర సమీపంలోని ముసలమ్మ చెట్టు దగ్గరున్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో కార్యాలయం ఇంకా ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. దీన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. తరువాతే అక్కడే 10 వేల మందితో సభను ఏర్పాటు చేయాలని చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి కంచర్లకు కేసీఆర్ టికెట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి