Pushpa 2 : యూట్యూబ్ ను షేక్ చేసిన 'పుష్ప పుష్ప' సాంగ్.. ఏకంగా అన్ని మిలియన్ల వ్యూస్? 'పుష్ప 2' ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 100 మిలయన్లకి పైగా వ్యూస్ అందుకుని చార్ట్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.26 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం. By Anil Kumar 28 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Pushpa 2 First Single Creates New Record : టాలీవుడ్ మోస్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన పుష్ప 2 రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియా అంతటా ట్రెండింగ్ లో నిలిచి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఇక రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఓ రేర్ ఫీట్ అందుకుంది. 'పుష్ప' సాంగ్ కి 100 మిలియన్స్ వ్యూస్ పుష్ప 2 మూవీని ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప అంటూ ఫుల్ మాస్ బీట్ తో సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 100 మిలయన్లకి పైగా వ్యూస్ అందుకుని చార్ట్ బస్టర్ గా నిలిచింది. Also Read : ఎట్టకేలకు కొత్త సినిమా అనౌన్స్ చేసిన గుణశేఖర్.. ఆసక్తికరంగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో! అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.26 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం. ఈ రికార్డ్ తో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా సెకెండ్ సింగిల్ ని రేవు ఉదయం 11. 07 గం.. లకు రిలీజ్ చేస్తున్నారు. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి' అంటూ సాగే ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #PushpaPushpa - people certified 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐂𝐇𝐀𝐑𝐓𝐁𝐔𝐒𝐓𝐄𝐑 ❤️🔥#Pushpa2FirstSingle hits a gigantic 𝟭𝟬𝟬 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉+ 𝙑𝙄𝙀𝙒𝙎 across 6 Languages on YouTube with 𝟮.𝟮𝟲 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉+ 𝙇𝙄𝙆𝙀𝙎 🔥🔥 🎶 https://t.co/dh555Vv1cb #Pushpa2SecondSingle will… pic.twitter.com/EVtd319SDv — Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2024 #pushpa-2-the-rule #pushpa-pushpa-song మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి