Family Disputes: 89 ఏళ్ల తాత విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడు.. మరి బామ్మ ఏం చేసిందో తెలుసా.. అమృత్ సర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో విడాకులు ఇప్పటించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఉద్యోగ రిత్యా తాను ట్రాన్స్‌ఫర్ అవగా.. తన వెంట భార్య రాలేదనే కారణంతో అతను విడాకులు కోరాడు. 1997లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఆయా కోట్లలో కేసు తిరిగి చివరు సుప్రీంకోర్టుకు చేరింది. చివరు సుప్రీంకోర్టు ఈ విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది. అయితే, ఇప్పుడు వీరి వయసు భర్త(89), భార్య (82). By Shiva.K 14 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Family Disputes: ఆ తాతకు 89 ఏళ్లు.. అవ్వకు 82 ఏళ్లు.. ఇద్దరూ 60 ఏళ్ల పాటు హ్యాపీగా కాపురం చేశారు. కానీ, ఏమైందో ఏమో కానీ.. ఆ తాతకు ఈ వయసులో విడాకులు కావాల్సి వచ్చింది. తనకు తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరి ఈ వయసులో తాత విడాకులు తీసుకుని ఏం చేస్తాడో తెలియదు కానీ.. విషయం మాత్రం హాట్ డిస్కషన్‌గా మారింది. మరి ఇంతకీ అవ్వ రియాక్షన్ ఏంటి? విడాకులకు ఒప్పుకుందా? ఇక కోర్టు ఏం తీర్పు ఇచ్చింది? ఈ కేసుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలపై ఓ లుక్కేసుకోండి.. ఇదికూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధుర జ్ఞాపకం. భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో విలువ ఉంటుంది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. ఎన్ని ఘర్షణలు, సంఘర్షణలు చోటు చేసుకున్నా.. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. చివరకు ఇద్దరూ ఒక్కటై.. ఆనందంగా ముందుకు సాగిపోతారు. అదే వివాహ బంధం గొప్ప లక్షణం. అయితే, ఇటీవలి కాలంలో వివాహానికి ప్రజల్లో విలువ తగ్గిపోతోంది. చిన్న చిన్న విషయాలకే అహానికి పోయి విడాకులు తీసుకుంటున్నారు. సరే.. వయసులో ఉన్నవారు ఏదో ఆవేశంలో విడాకులు తీసుకుంటున్నారని భావించొచ్చు. కానీ, కాటికి కాళ్లు చాపే వయసులో విడాకులు కోరుతున్నాడు ఓ తాత. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన జంట విడాకుల పంచాయితీ ఇప్పటిది కాదు.. 1997 నాటిది. వాస్తవానికి వీరిద్దరూ మంచి ఉన్నత స్థితిలో ఉన్నవారే. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. భర్త IAF అధికారి.. భార్య ఉపాధ్యాయురాలు. ఉద్యోగాలే.. ఇద్దరి మధ్య ఎడబాటుకు కారణమైంది. 1984 జనవరిలో సదరు అధికారికి అమృత్‌సర్ నుండి మద్రాసుకు బదిలీ అయ్యింది. అయితే, అతనితో కలిసి మద్రాస్‌కు షిఫ్ట్ అయ్యేందుకు భార్య నిరాకరించింది. అత్త, కొడుకు వద్దే ఉంటానని చెప్పింది. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అది కాస్తా విడాకుల వరకు వెళ్లింది. తన భార్యతో విడాకులు ఇప్పించాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించాడు. 1997లో చండీగఢ్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలవగా.. సంవత్సరాల తరబడి వాదనల తర్వాత 2000లో వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. అయితే, ఈ విడాకులను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్-హర్యానా హైకోర్టును అతని భార్య ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. డిసెంబర్ 2000లో విడాకులను రద్దు చేసింది. ఫిబ్రవరి 2009లో హైకోర్టు డివిజన్‌ను ఆశ్రయించగా.. ఈ కోర్టు కూడా విడాకులను రద్దు చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సదరు వ్యక్తి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనను హింసించిందని, తనతో ఉండకుండా వెళ్లిపోయిందని పిటిషన్‌లో ఆరోపించిన భర్త.. సాక్ష్యాలు చూపించలేకపోయాడు. దీంతో వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను ఈ మధ్యనే కొట్టేసింది. మొత్తంగా పెళ్లైన 60 ఏళ్ల తరువాత విడాకులు కావాలని ఇంకా కోరడం విచిత్రంగా ఉంది. ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..? #supreme-court-of-india #family-disputes #divorce-at-89-years మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి