Nandyala: నంద్యాల జిల్లాలో శివ స్వాముల నిరసన నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ కార్యాలయం ఎదుట శివ స్వాములు నిరసన చేపట్టారు. శ్రీశైలం వెళ్లే శివ భక్తుల నుండి ఫారెస్ట్ అధికారులు పది రూపాయలు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. By Jyoshna Sappogula 25 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Nandyala: నంద్యాల జిల్లాలో శివ స్వాముల నిరసన చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం శివ భక్తుల నుండి చార్జీలు వసూలు చేయడాన్ని వెంటనే ఫారెస్ట్ అధికారులు విరమించుకోవాలి డిమాండ్ చేశారు. లేదంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో "చలో ఆత్మకూరు "కార్యక్రమం చేపడతాం అని హెచ్చరించారు. Also Read: రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్..సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం..! ఆత్మకూరు నుండి నల్లమల్ల అటవి మార్గం గుండా నడకదారిలో శ్రీశైలం వెళ్లే శివ భక్తులు, శివ స్వాముల నుండి ఫారెస్ట్ అధికారులు పది రూపాయల రుసుము వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శివ స్వాములు ఆత్మకూరులోనీ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. Also Read: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్ రికార్డు! ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టారు. నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలిసిన రుద్రకోడూరు, ఇష్టకామేశ్వరి దేవి, శ్రీశైలం వెళ్లే భక్తుల నుండి ఫారెస్ట్ అధికారులు ముక్కుపిండి రుసుము వసూలు చేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల నుంచి వచ్చే ఆచారాలను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం మంచిది కాదన్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి శివ భక్తులపై రుసుము రూపంలో వసూలు చేసే అదనపు భారాన్ని రద్దు చేయకపోతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ""చలో ఆత్మకూరు"" కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. #kurnool మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి