Bhainsa : కేటీఆర్‌పై దాడి.. టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరిన దుండగులు!

భైంసాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులతో పలువురు నిరసన వ్యక్తం చేశారు. జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటాలు ప్రచార వాహనం సమీపంలో పడగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

New Update
Bhainsa : కేటీఆర్‌పై దాడి.. టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరిన దుండగులు!

BRS : బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) గురువారం నిర్మల్‌ జిల్లా బైంసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం(Election Campaign)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని పాత చెక్‌పోస్ట్‌ కార్యాలయం కూడలి వద్ద కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో కొందరు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Also Read : బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్

ఈ మేరకు కేటీఆర్‌ ప్రసంగిస్తుండగా.. జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు(Onions), టమాటాలు(Tomato).. ప్రచార వాహనం సమీపంలో కిందపడ్డాయి. ఒక్కసారిగా హనుమాన్ భక్తులు కేటీఆర్ చుట్టుముట్టి పర్యటించకుండా అడ్డుకున్నారు. గతంలో రాముడిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అడ్డగించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపుతప్పకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఆందోళనకారులను, బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి కేటీఆర్‌కు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసన కారుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల మధ్యే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. మీటింగ్‌ పూర్తయిన తర్వాత ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు