కాంగ్రెస్ పార్టీ లేకపోతే బానిసలుగా ఉండేవాళ్లం: నిర్మాత బండ్ల గణేష్ ..! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, భట్టి పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’పాదయాత్రలో పాల్గొంటానని సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భట్టిని కలిసేందుకు బండ్ల గణేష్ సూర్యాపేటకు వెళ్లి భట్టి యాత్రలో పాల్గొన్నారు. అయితే వీరిద్దరి కలయిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. By Shareef Pasha 25 Jun 2023 in రాజకీయాలు నల్గొండ New Update షేర్ చేయండి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. సినీ నిర్మాత బండ్ల గణేష్, భట్టిని కలవడంతో ప్రస్తుతం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అంతేకాదు పొలిటికల్ కామెంట్స్ చేయడంతో పాలిటిక్స్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అయితే, తాను రాజకీయాల్లో లేనంటూనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కామెంట్స్ చేశారు. దీంతో ఆయన మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వల్లే భారతదేశం వచ్చిందని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే బ్రిటిష్ వాళ్ల కింద బానిసలుగానే ఉండేవాళ్ళమని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు సూర్యాపేట జిల్లాలో ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గణేష్.. ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. సోనియాగాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. కర్ణాటక నుండి కాంగ్రెస్ హుదూద్ తుఫాన్ మొదలైందన్న గణేష్... తెలంగాణ నుండి గెలుచుకుంటూ, ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాయమని ధీమా వ్యక్తం చేశారు. 150రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ నుంచి అలుపెరగకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు. అందుకే ఆయనకు మద్ధతిచ్చే్ందుకు ఇక్కడికి వచ్చానన్నారు. భట్టికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉందని చెప్పారు. బండ్లన్న ట్విట్టర్‌లో ‘అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాల్గొని, అనంతరం మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను’అంటూ కామెంట్స్ చేశారని బండ్ల గణేష్ తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. అయితే గతంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే బ్లేడ్‌తో పీక కోసుకుంటా అంటూ ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ దగ్గర అత్యుత్సాహం చూపించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి