Vihari V/S Prithvi: క్రికెటర్ విహారిపై పృథ్వీ రాజ్ తండ్రి కంప్లైంట్..! తన కొడుకు పృథ్వీ రాజ్‌పై దుర్భశలాడినందుకు క్రికెటర్ విహారిపై కంప్లైంట్ చేశానన్నారు తిరుపతి 25th వార్డు కార్పొరేటర్ నరసింహాచారీ. నిజంగా అతన్ని తొలగించేంత పలుకుబడి ఉంటే తన కొడుకునే కెప్టెన్ చేసుకునేవాడినని అన్నారు. By Jyoshna Sappogula 27 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Cricketer Vihari V/S Prithvi Raj: ఏపీ క్రికెట్ అసోసియేషన్ నుంచి భారత క్రికెటర్ హనుమ విహారి శాశ్వతంగా తప్పుకోవడం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్ (Andhra Cricket) తరఫున ఆడనని విహారి తేల్చి చెప్పారు. ఆంధ్ర క్రికెట్ సంఘంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నేత కొడుకు వికెట్ కీపర్ పృధ్వీరాజ్ కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని హనుమ విహారి ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: రాడిసన్ డ్రగ్స్ కేసులో పెను సంచలనాలు.. నిందితుల లిస్ట్ లో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి..! ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్‌లో విహారి, పృధ్వీరాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. అభ్యంతరకర భాషను ఎవరూ సహించరంటూ విహారిపై మాటలదాడికి దిగాడు కుంట్రపాకం పృధ్వీరాజ్. ఇకపై ఆంధ్ర క్రికెట్‌కు ఆడనన్న విహారిపై మండిపడ్డాడు. ఇంతకన్న నువ్వు ఏం పీకలేవ్ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. సింపతీ గేమ్స్ ఆడుకో అని స్టేటస్ పెట్టాడు. Also Read: తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. చిందులేస్తున్న చిన్నారులు..! తాజాగా, ఈ వివాదంపై పృథ్వీ రాజ్ తండ్రి తిరుపతి 25th వార్డు కాప్పోరేటర్ నరసింహాచారీ స్పందించారు. తన కొడుకు పృథ్వీ రాజ్‌పై దుర్భశలాడినందుకు క్రికెటర్ విహారిపై కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. నిజంగా విహారిని తొలగించేంత పలుకుబడి ఉంటే తన కొడుకునే కెప్టెన్ చేసుకునేవాడినని అన్నారు. తన కొడుక్కి జరిగిన అన్యాయంపై ఓ తండ్రిగా స్పందించడం తప్పా అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ యుద్ధం మరింత ముదురుతోంది. కాగా, ఇప్పటికే హనుమ విహారి తప్పుకోవడంపై విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, షర్మిల సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. #andhra-pradesh #prithvi-raj #cricketer-vihari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి