PM Modi: తొలి విదేశీ పర్యటనకు సిద్దమైన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఇటలీలో జరిగే జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన హాజరు అవుతున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.

New Update
Handloom Day : ఆగస్టు 7న ఆ దుస్తులే కొనండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు!

PM Modi: ప్రధాని మోదీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఇటలీలో జరిగే జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన హాజరు అవుతున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. సదస్సులో భాగంగా అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, అబుధాబి రాజు షేక్‌ మోహమ్మద్‌ బిన్‌ జాయద్‌, మరి కొందరు అరబ్‌ రాజకుటుంబీకులను మోదీ కలుసుకుంటారని పేర్కొంది.

మోదీ పర్యటన, సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇటలీలోని భారత రాయబారి ఎస్‌.వాణి రావు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి ప్రపంచ దేశాధినేతలందరూ శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉండడంతో.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌కు చెందిన వాణి రావు.. తెలుగు రాష్ట్రాల నుంచి రాయబారిగా నియమితులైన ప్రథమ మహిళ కావడం విశేషం. కాగా, రాబోయే త్వరలోనే జరిగే బిమ్స్‌టెక్‌, జీ–20, ఆసియన్‌– ఈస్ట్‌ ఆసియా సదస్సులకు మోదీ హాజరు కానున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు