BIG BREAKING: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్న జో బైడెన్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేయనున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 19 Jul 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేయనున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న జో బైడెన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జో బైడెన్ కు ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ తో పాటు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. బైడెన్ ను అధ్యక్ష రేసులో నుంచి తప్పించాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ట్రాంప్ చేస్తున్న ఆరోపణలపై బైడెన్ సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని.. వయసు మీద పడడంతో అంత చురుగ్గా ప్రతిపక్షలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం విఫలం అవుతున్నారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా సొంత పార్టీ నుంచే అసమ్మతి రావడంతో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉందని న్యూస్‌మాక్స్ అనే సంస్థ పేర్కొంది. జర్నలిస్ట్ మార్క్ హాల్పెరిన్ మాట్లాడుతూ, డెమొక్రాటిక్ అభ్యర్థిగా వైదొలగడానికి అధ్యక్షుడు జో బిడెన్ అంగీకరించారని చెప్పాడు. తన వారసుడిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఆయన మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారని తెలిపాడు. కాగా దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజుకు వేచి చూడాలి. #joe-biden మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి