Bharat Ratna: పీవీకి భారత్ రత్న... అందుకున్నది ఎవరో తెలుసా
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
PV Narasimha Rao : ఢిల్లీ(Delhi) లోని రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) లో శనివారం భారతరత్న(Bharat Ratna) అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించగా... వారికి రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు(PV Narasimha Rao) తరుఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.
కర్పూరీ ఠాకూర్ తరుఫున ఆయన కుమారుడు రామ్ నాథ్, చౌదరీ చరణ్ సింగ్ తరఫున ఆయన మనవుడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరుఫున ఆయన కుమార్తె నిత్యా రావు ఈ అవార్డులను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ చీఫ్ ఖర్గే పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆద్వానీ కి ఆయన ఇంటికి వెళ్లి అవార్డును అందజేస్తారు.
పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.
ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.
ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.