Telangana: ప్రవళిక ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. కీలక వ్యాఖ్యలు చేసిన తల్లి..

చిక్కడపల్లి ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లి, సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడే నా బిడ్డను టార్చర్ చేశాడు.' అంటూ ప్రవళిక తల్లి సంచలన ఆరోపణలు చేశారు. 'నా కొడుకు, కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. కూలీ పనులు చేసుకోవద్దని కష్టపడి కోచింగ్ ఇప్పించాం. కానీ ప్రవళికను శివరామ్ ప్రేమ పేరుతో వేధించాడు. నా బిడ్డను శివరామ్ టార్చర్ చేశాడు. ఈ విషయం చెప్పలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. వాడిని కఠినంగా శిక్షించాలి.' అని డిమాండ్ చేశారు.

New Update
Telangana: ప్రవళిక ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. కీలక వ్యాఖ్యలు చేసిన తల్లి..

Pravalika Suicide Case: చిక్కడపల్లి ప్రవళిక(Pravalika) ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యువతి ఆత్మహత్యపై ఆమె తల్లి, సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడే నా బిడ్డను టార్చర్ చేశాడు.' అంటూ ప్రవళిక తల్లి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ప్రవళిక తల్లి విజయ.. 'నా కొడుకు, కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. కూలీ పనులు చేసుకోవద్దని కష్టపడి కోచింగ్ ఇప్పించాం. కానీ ప్రవళికను శివరామ్ ప్రేమ పేరుతో వేధించాడు. నా బిడ్డను శివరామ్ టార్చర్ చేశాడు. ఈ విషయం చెప్పలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. వాడిని కఠినంగా శిక్షించాలి.' అని డిమాండ్ చేశారు. ప్రవళిత సోదరుడు ప్రణయ్ మాట్లాడుతూ.. 'అక్క, నేను అశోక్‌నగర్‌లో చదువుకుంటున్నాం. అక్కను రోజూ కలిసేవాడిని. శివరామ్ అనే వ్యక్తి వేరే అమ్మాయి ద్వారా పరిచయం అయ్యాడు. ఆమెను వేధించేవాడు. ఈ విషయం మాకు చెప్పలేదు. శివరామ్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లింది. అందుకే ఆత్మహత్య చేసుకుంది.' అని ప్రవళిక సోదరుడు ప్రణయ్ చెప్పాడు.

ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

శివరామ్ వేధింపుల వల్లే తమ బిడ్డ చనిపోయిందని ప్రవళిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శివరామ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రవళిక మృతిపై రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్‌పై వారు తీవ్రంగా స్పందించారు. బిడ్డ చనిపోయిందన్న బాధలో తామున్నామని, రాజకీయాల కోసం తమను వాడుకోవద్దని కోరారు. కాగా, హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో గతవారం ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు పరీక్షల వాయిదా కారణంగానే ఆమె చనిపోయిందటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Revanth Reddy: రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లేఖ రాశారు. ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

New Update
CM Revanth Letter To BJP MLA Raja Singh

CM Revanth Letter To BJP MLA Raja Singh

బీజేపీ గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

Also Read :  నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా..టోల్ సిబ్బందిపై దాడి

Revanth Reddy Letter To Raja Singh

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

ఈ లేఖను రాజాసింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. పుట్టినరోజు శుభ సందర్భంగా శుభాకాంక్షలు పంపినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ పోస్ట్ చేశారు. ఇంకా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు రాజాసింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read :  మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

 

revanth-reddy | goshamahal mla raja singh | latest telangana news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telangana-politics

Advertisment
Advertisment
Advertisment