Kalki Day 4 Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'కల్కి' వసూళ్ల సునామీ.. నాలుగు రోజుల్లో రూ. 302 కోట్లు..!

ప్రభాస్ కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 415 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

New Update
Kalki Day 4 Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'కల్కి' వసూళ్ల సునామీ.. నాలుగు రోజుల్లో రూ. 302 కోట్లు..!

Kalki Day 4 Collections: స్టార్ కాస్ట్ ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన చిత్రం 'కల్కి 2898 AD'. జూన్ 27 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 415 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

Sacnilk డేటా ప్రకారం, 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం హృతిక్ రోషన్ 'ఫైటర్'. కానీ ఇప్పుడు ఈ రికార్డును 'కల్కి 2898 AD' బ్రేక్ చేసింది. 'ఫైటర్' బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం 212.79 కోట్లు వసూలు చేయగా.. 'కల్కి 2898 ఏడీ' నాలుగు రోజుల్లోనే రూ.302.4 కోట్లు రాబట్టింది. కేవలం నాలుగవ రోజు రూ. 85.00 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కల్కి నాలుగు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

'కల్కి 2898 AD' నాలుగు రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  • 1వ రోజు – రూ. 95.3 కోట్లు
  • 2వ రోజు – రూ. 57.6 కోట్లు
  • 3వ రోజు – రూ. 64.5 కోట్లు
  • 4వ రోజు – రూ. 85.00 కోట్లు
  • మొత్తం – రూ. 302.4 కోట్లు

కల్కి హిందీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ప్రభాస్ కల్కి మంచి వసూళ్లు రాబడుతోంది. నాలుగు రోజుల్లోనే హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ రూ.100 కోట్లు దాటేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.22.5 కోట్లు, రెండో రోజు రూ.23 కోట్లు, మూడో రోజు రూ.26 కోట్లు, నాలుగో రోజు రూ.39 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ కలెక్షన్ మొత్తం 110.5 కోట్లకు చేరుకుంది.

Also Read: Varalakshmi Sarath kumar: ప్రధాని మోదీకి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహ ఆహ్వానం.. ఫొటోలు వైరల్..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు