Uttam: కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపం.. ఇరిగేషన్ పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్!

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు తెలంగాణ ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపంగా మారాయన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నారని ఆరోపించారు.

New Update
Uttam: కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపం.. ఇరిగేషన్ పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్!

Power Point Presentation in TS Assembly: సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇరిగేషన్ పై అసెంబ్లీలో కాంగ్రెస్‌ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తోంది. కేసీఆర్ హయాంలో కృష్ణా నీటి వాటాలో.. గతంకంటే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. జీవో 203 ఇచ్చి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచారన్నారు. రోజుకు 3 టీఎంసీల కెపాసిటీతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టారని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నారన్నారు. 2004 -2014 వరకు శ్రీశైలం రిజర్వాయర్‌కు 10,665 టీఎంసీలు వస్తే తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి 2024 వరకు 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయన్నారు.

ఆయన వల్లే ఇదంతా జరిగింది.. ఉత్తమ్ ఫైర్:
కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపంగా మారాయని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి వాటాల్లో రాష్ట్ర వాటాను కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ విమర్శించారు. ప్రాధాన్యతల ప్రకారం కృష్ణా నీటిని పంపిణీ చేయాలని కోరుతున్నామన్నారు ఉత్తమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు. కృష్ణా వాటర్ తెలంగాణకు ప్రధాన జీవనాధారమన్నారు.

ఉత్తమ్ ఏం అన్నారంటే?
----> తెలంగాణ ఏర్పడ్డాక 50శాతం ఎక్కువ నీళ్లు ఆంధ్రాకు అక్రమంగా తరలించారు.
----> ఎక్కువ నీళ్లు అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు-ఉత్తమ్.
----> జీవో 203 ఇచ్చి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచారు.
----> రోజుకు 3 టీఎంసీల కెపాసిటీతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టారు.
----> పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యం వైఎస్ హయాంలో 44వేల క్యూసెక్కులు.
----> 2020లో 92,500 క్యూసెక్కులకు పెంచారు.
----> కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు-ఉత్తమ్
----> 68 నుంచి 70శాతం నీళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు నష్టం చేసింది-ఉత్తమ్
----> మనవాటా 731టీఎంసీ వాడుకునే అవకాశమున్నా.. ఇప్పటికే అమల్లో ఉన్న 299టీఎంసీలనే అడిగారు-ఉత్తమ్

తెలంగాణకు అన్యాయం చేశారు- ఉత్తమ్:
తెలంగాణకు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీరు రాలేదని ఆరోపించారు ఉత్తమ్. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. రూ. 27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కలుపుకొని 599 టీఎంసీ అవసరం ఉంటే బోర్డును ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఈ పదేళ్లలో తెలంగాణలో జరిగిన అక్రమాలు స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో జరగలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అర్థం లేకుండా పోయిందని వాపోయారు. కేసీఆర్ చాలా గొప్పోడు అంటూ ఏపీ సీఎం జగన్ ప్రశంసించారని.. ఏపీలో జగన్ ప్రభుత్వంతో అంటకాగుతూ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మీరు(బీఆర్‌ఎస్‌) చేసిన పనుల వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎండిపోవడం ఖాయమని ధ్వజమెత్తారు ఉత్తమ్.

(THIS IS AN UPDATING STORY)

Advertisment
Advertisment
తాజా కథనాలు