PM Modi : ప్రధాని పర్యటన వేళ...హైదరాబాద్ టు నిజామబాద్ పోస్టర్ల కలకలం..!! ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన వేళ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రధానికి వ్యతిరేకంగా పెద్దెత్తున ఈ పోస్టర్లు వెలిశాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అటు నిజామాబాద్ లోని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఓట్ల కోసం మాఇళ్లకు రావద్దంటూ కొన్ని ప్రాంతాల్లో వెలిస్తే...మోదీజీ హామీలు ఏమయ్యాయంటూ మరికొన్ని చోట్ల పోస్టర్లు అతికించడం హాట్ టాపిగ్గా మారింది. By Bhoomi 01 Oct 2023 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన వేళ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రధానికి వ్యతిరేకంగా పెద్దెత్తున ఈ పోస్టర్లు వెలిశాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అటు నిజామాబాద్ లోని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఓట్ల కోసం మాఇళ్లకు రావద్దంటూ కొన్ని ప్రాంతాల్లో వెలిస్తే...మోదీజీ హామీలు ఏమయ్యాయంటూ మరికొన్ని చోట్ల పోస్టర్లు అతికించడం హాట్ టాపిగ్గా మారింది. ప్రధాని మోదీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. మహబూబ్ నగర్ లో జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు. అక్కడ అధికారిక కార్యక్రమంతోపాటుగా బీజేపీ ఏర్పాటు భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటన వేళ నగరంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రధానికి వ్యతిరేకంగా నగరంలో పోస్టర్లు వెలిశాయి. మోదీకి తెలంగాణలో పర్యటించే హక్కులేదంటూ వెలిసిన పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు. ప్రాజెక్టుల జాతీయ హోదాపై జరిగిన అన్యాయంపై పోస్టర్లలో ప్రశ్నిస్తున్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు, కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు హోదా ఇచ్చారు. మరి తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ సమీపంలో ఉగ్రదాడి.. కాల్పులు!! తెలంగాణపై మోదీది సవతితల్లి ప్రేమ అని..మోదీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదని పోస్టర్లపై రాసారు. పసుపు బోర్డు హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. ఆ హామీలన్నీ నీటిముఠాలేనా అంటూ ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. Hyderabad: On Indian Prime Minister Narendra Modi’s visit to Telangana state, several posters have surfaced in various parts of the state saying he had no right to visit the state after insulting its formation.#ModiIsScarED #ModiGovernment #Hyderabad #telengana pic.twitter.com/sfl5rgH9yj — Fahad Ali (@FahadAl61719173) October 1, 2023 ఇది కూడా చదవండి: మహిళలు గుడ్న్యూస్…భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..! అటు నిజామాబాద్ జిల్లాల్లోనూ మంచిప్పలో పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.మోదీ పర్యటన నేపథ్యంలో గుర్తు తెలియన వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించినట్లు తెలుస్తోంది. ఓట్ల కోసం మా ఇళ్లకు రావద్దూ మోదీ అంటూ మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు తమ ఇండ్లకు పోస్టర్లను అతికించుకున్నారు. రిజర్వాయర్ రీడిజైన్ రద్దు చేస్తేనే తమ గ్రామాలకు రావాలని అందులో పేర్కొన్నారు. అధికారులను కూడా ముంపు గ్రామాలకు రానివ్వం అంటూ వెలసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. అయితే ఈ పోస్టర్లపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీంతో మంచిప్పలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. Ahead of PM #NarendraModi visit to #Telangana, posters, flexi surfaces against #PMModi, saying "What Happened to your promise of National Status for #PalamuruRangareddyProject ." Another Poster as Ravanasur, says "Modi Promises to Telangana"#BJP #BRS #TelanganaElections2023 pic.twitter.com/EVWiZKGuiF — Surya Reddy (@jsuryareddy) October 1, 2023 #pm-modi #modi-posters మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి