ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫారాలపై పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన.. ప్రతి కుటుంబానికి

ప్రభుత్వం అందించబోయే ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫారాలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంపై కాంగ్రెస్ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.

New Update
ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫారాలపై పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన.. ప్రతి కుటుంబానికి

Six guarantees : కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోయే ఆరు గ్యారంటీలపై ఫారమ్ లపై మంత్రి పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 నుంచి దరఖాస్తుఫారమ్ లు స్వీకరించబోతున్నట్లు తెలుస్తుండగా లబ్ది దారులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి చాలామంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అర్హులుగా ఎవరినీ గుర్తిస్తారు? రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏమిటి? ఈ అప్లికేషన్స్ మీసేవ లోనా, గ్రామా పంచాయితిలోనా లేక ఎక్కడ లభిస్తాయనే అంశాల స్పష్టత లేకపోవడంతో హైరానా పడుతున్నారు. కాగా తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై స్పష్టతనిచ్చారు.

ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజాపాలన (praja paalana)కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 28వ తారీకు నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి : ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ ఉర్దూలో ఉండాల్సిందే.. రేవంత్ సర్కార్ కు అసదుద్దీన్ డిమాండ్!

అలాగే అప్పులు కాదు సంపద సృష్టించామని స్వేద పత్రం విడుదల చేసిన బిఆర్ఎస్ నాయకులు, ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌధ పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ఐదో తేది లోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధు లుగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు