తెలంగాణలో బీఆర్ఎస్‌ను బొందపెడ్తం అంటూ పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు ఖమ్మం జనగర్జన సభను అడ్డుకోవడంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలు ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా జనమంతా ఖమ్మంకు తరలివచ్చి సభను విజయవంతం చేశారని చెప్పారు. అధికార పార్టీ సభపెడితే జనం లేక వెలవెలబోయిందని ఎద్ధేవా చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తలదన్నే రీతిలో తాము సభను నిర్వహించామని అన్నారు. By Shareef Pasha 03 Jul 2023 in రాజకీయాలు ఖమ్మం New Update షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పదికి పది, రాష్ట్రంలో 100 సీట్లను గెలిచి బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పి బీఆర్‌ఎస్‌ను బొంద పెడ్తామంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసి పెను దుమారం రేపుతున్నాయి. పువ్వాడ సూచనలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని.. ఆయన కంటే తెలివైనోళ్లు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారని విమర్శించారు. జనగర్జన సభ గురించి మాట్లాడే అధికార పార్టీ నేతల కళ్లకు పచ్చ కామెర్లు వచ్చాయంటూ పొంగులేటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కంటి వెలుగు పథకాన్ని వినియోగించుకుని అద్ధాలు వాడాలని సూచిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొంగులేటి వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ ఎక్కీ రాజకీయ రగడ మొదలైందనే చెప్పాలి. దాంతో ఖమ్మంలో రాజకీయ వ్యాఖ్యలకు తెర తీశారనే చెప్పాలి. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కుమారుడు వస్తే ప్రభుత్వం కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ నీతిమాలిన పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ను ఫాంహౌజ్ కే పరిమితం చేయాలని భావించినప్పుడు కాంగ్రెస్ సభలు ఇలాగే విజయవంతం అవుతాయన్నారు. బీఆర్ఎస్ హిట్లర్ లా వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు తాగిన మైకంలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి