AP-TS: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్.. ఎంత శాతం నమోదైందంటే? తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో లోక్ సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్ సమస్యాత్మక ప్రాంతాలు మినహా అంతటా సాయత్రం 6 గంటల వరకూ కొనసాగింది. తెలంగాణలో 61.16, ఏపీలో 75 శాతం నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. By srinivas 13 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి AP-TS: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో లోక్ సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్ ఉదయం 6గంటలనుంచి సాయత్రం 6గంటల వరకూ కొనసాగింది. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో సాయంత్రం 6 గంటలవరకూ మొత్తం పోలింగ్ శాతం 61.16 నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్ లో 63.96, అత్యల్పంగా హైదరాబాద్ లో 29.47శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో మొత్తం 75% పోలింగ్ నమోదవగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55 శాతం నమోదైనట్లు ఈసీ తెలిపింది. మరికొద్ది సేపట్లో తుది ఓటింగ్ లెక్కలను ఈసీ వెల్లడించనుంది. ప్రస్తుత సరళిని పరిశీలిస్తే ఏపీలో 80శాతం వరకూ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం.. తెలంగాణలో ఒకటి రెండు చిన్న వివాదాలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏపీలో మాత్రం పెద్దు ఎత్తున వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇక నిర్దేశించిన సమాయానికి పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ లో నిలుచున్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు ఈసీ ప్రకటించింది. భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో లెక్కలు తెప్పించుకుంటున్నాయి. పోలింగ్ సరళి ఎలా ఉందనే అంశంపై అగ్రనేతలు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో సున్నితమైన ప్రాంతలైన 13 నియోజకవర్గాలు సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో 4గంటలకు పోలింగ్ ముగిసింది. ఏపీలో మూడు నియోజకవర్గాలు అరకు, పాడేరు, రంపచోడవరంలోనూ ఇదే సమయానికి పోలింగ్ ముగించారు అధికారులు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించిన పోలీసులు.. పల్నాడు నరసరావుపేటలో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనవాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేయడంతో టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసుల ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలపై రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెం పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ విషయంలో వివాదం క్రియేట్ చేసిన టీడీపీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో జెట్టిపాలెంలో 5 గంటలకు పోలింగ్ నిలిచిపోయింది. బాపట్ల గవినివారిపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులు టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య వాహనంపై రాళ్లదాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం కావడతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో మంగళహట్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ ధాఖలు చేశారు. #telugu-states #polling-ended మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి