AP: టీడీపీ దాడి కేసు.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి సమయంలో ఎక్కడ ఉన్నారనే విషయాలపై మంగళగిరిలో ఉన్న గ్రామీణ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు.

New Update
AP POLICE

AP: గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు నివాసంపై దాడులు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిన చెల్లుతుందనే ఉద్దేశంతో వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కేసును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చూడండి:  Stock Markets: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముగ్గురు నేతలను..

ఈ దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మంగళగిరిలో ఉన్న గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఈ ముగ్గురు వైసీపీ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. దాడులు జరిగిన రోజు వీరు ముగ్గురు ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారు? ఎక్కడెక్కడ కలిశారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  Muthyalamma : అమ్మవారి విగ్రహం ధ్వంసం.. ఆలయం వద్ద పెరిగిన ఉద్రిక్తత

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు అయిన దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరో 14 మంది దాడి చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరంతా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు.

ఇది కూడా చూడండి: Ap Crime: అత్తా కోడళ్ల అత్యాచారం కేసు..ఇద్దరు నిందితుల అరెస్ట్‌!

ముందస్తు బెయిల్‌ ఇవ్వడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ దాడుల వెనుక గత ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణ రెడ్డి హస్తం కూడా ఉందనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇతన్ని కూడా విచారణ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే కేసు వేగవంతం అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి:  Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు