పెళ్లిపై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు

దువ్వాడ శ్రీనివాస్, మాధురి పెళ్లి చేసుకున్నారని వచ్చిన వార్తలను అతను ఖండించారు. పార్టీ కార్యకర్తలతో తిరుమల బ్రహ్మోత్సవాలు చూడటానికి వెళ్లానని దువ్వాడ తెలిపారు. అందరిలాగానే తాను తిరుమలకు వెళ్లారని, దుష్ప్రచారాలను ప్రచారం చేయవద్దని కోరారు.

New Update

దువ్వాడ శ్రీనివాస్, మాధురి నిన్న తిరుమల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి శ్రీవారిని దర్శించుకోవడంతో త్వరలో పెళ్లి చేసుకుంటానని శ్రీనివాస్ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పెళ్లిపై వార్తలపై క్లారిటీ ఇచ్చారు. స్వామి వారి దర్శనానికి వెళ్తే దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. తిరుమలలో మాధురిని పెళ్లి చేసుకున్నానని అనడం కరెక్ట్ కాదన్నారు.

ఇది కూడా చూడండి: ఆరవ రోజు.. దుర్గమ్మ దర్శనం ఏ అవతారంలో అంటే?

పార్టీ కార్యకర్తలతో..

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ప్రీ వెడ్డింగ్ షో చేశామంటూ కొందరు ప్రచారం చేశారు. తిరుమలను దర్శించుకోవడం నిజమే. మా ఇంటి దేవుడు అయిన వెంకన్నస్వామిని అందరిలాగానే తాను కూడా దర్శించుకున్నట్లు తెలిపారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీసి దుష్ప్రచారం చేశారని అతను ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: Garudaseva: బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి?

తిరుమల బ్రహ్మోత్సవాలను చూసేందుకు.. తన పార్టీ కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నానన్నారు. నేను వెళ్లిన సందర్భంలో మాధురి కూడా తిరుమల వచ్చింది. లేనిపోని గొడవలు క్రియేట్ చేయవద్దని దువ్వాడ కోరారు. ఇప్పటికీ చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, ప్రస్తుతం మానసిక క్షోభ ఎదుర్కుంటున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఇకనైన తనపై దుష్ప్రచారాలను ఆపాలని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: వాటా డబ్బులు అడిగినందుకు.. కాళ్లు, చేతులు కట్టేసి కిరాతంగా?

Advertisment
Advertisment
తాజా కథనాలు