Big Breaking: కేజ్రీవాల్ కి బెయిల్ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక పిటిషన్‌లో, కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ, ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేశారు. By Bhavana 13 Sep 2024 in రాజకీయాలు నేషనల్ New Update షేర్ చేయండి Big Breaking: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. రూ.10 లక్షలు పూచికత్తు, ఇద్దరు హామీతో బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, బెయిల్ మంజూరుకు సంబంధించిన ట్రిపుల్ షరతులను కేజ్రీవాల్ అంగీకరించడంతో ఈ బెయిల్ ను ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనల ఆధారంగా మూడు ప్రశ్నలను రూపొందించినట్లు కోర్టు పేర్కొంది. “మేము 3 ప్రశ్నలను రూపొందించాము. అరెస్టులో చట్టవిరుద్ధం ఉందా, అప్పీలుదారుకి రెగ్యులర్ బెయిల్ అనుమతించాలా, ఛార్జిషీట్ దాఖలు చేయడం వల్ల TCకి బహిష్కరించేంత పరిస్థితిలో మార్పు ఉందా” అని న్యాయమూర్తులు సూర్యకాంత్ లైవ్ లా ద్వారా పేర్కొన్నారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడంలో ఎలాంటి ఆటంకం లేదని ఆయన అన్నారు. “సీబీఐ, వారి దరఖాస్తులో, అది ఎందుకు అవసరమని భావించింది అనేదానికి కారణాలను నమోదు చేసిందని సుప్రీం కోర్టు గుర్తించింది. కేజ్రీవాల్ బెయిల్‌పై జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన సమాజానికి బెయిల్‌పై అభివృద్ధి చెందిన న్యాయశాస్త్రం అవసరం, విచారణ జరుగుతున్నప్పుడు నిందితులను సుదీర్ఘకాలం జైలులో ఉంచడం కరెక్ట్ కాదని వారు అభిప్రాయపడ్డారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ ‘ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు అయితే చేర్చలేదు. కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని సింఘ్వీ వివరించారు. కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. అవి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. సీబీఐ తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రెండో పిటిషన్‌లో కేజ్రీవాల్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. అంతకుముందు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కోరింది. కేజ్రీవాల్ బెయిల్‌ను హైకోర్టు వ్యతిరేకించగా, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ సాక్షులను ప్రభావితం చేయవచ్చని సీబీఐ తన వాదనలో ధర్మాసనానికి వినిపించింది. కేజ్రీవాల్ పిటిషన్లపై ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి కేసులో తన అరెస్టును హైకోర్టు సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 5న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని హైకోర్టు వివరించింది. సంబంధిత సాక్ష్యాలను చూస్తే కారణం లేకుండా లేదా చట్టవిరుద్ధమైన అరెస్టు అని చెప్పలేమని కోర్టు పేర్కొంది. ఆయన బెయిల్ పిటిషన్‌పై కింది కోర్టును ఆశ్రయించేందుకు కూడా హైకోర్టు అనుమతించింది. ఈ కేసు ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ 2021-22 రూప కల్పన, అమలులో అవినీతికి సంబంధించినది. తర్వాత ఈ విధానం రద్దు చేసింది. ఆరోపించిన ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్‌పై ప్రత్యేక కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ పాలసీని సవరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మనీలాండరింగ్ చట్టం కింద “అవసరం, నిర్బంధం” అనే అంశంపై మూడు ప్రశ్నల సందర్భంలో లోతైన పరిశీలన కోసం ఉన్నత న్యాయస్థానం దానిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కి సిఫార్సు కి పంపింది. ఈ క్రమంలోనే ఒక పిటిషన్‌లో, కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ, ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేశారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, బెయిల్ మంజూరుకు సంబంధించిన ట్రిపుల్ షరతులను కేజ్రీవాల్ అంగీకరించడంతో ఈ బెయిల్ ను ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. Also Read: భారత్ లో పెరుగుతున్న జీసీసీలు…28 లక్షల ఉద్యోగాలకు అవకాశం! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి