Nara Lokesh: లోకేష్ కాన్వాయ్ తనిఖీలు.. లక్షా 80వేల మానిఫెస్టో కాపీలు.. కారణం ఇదేనా..!

ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా మంగళగిరిలో లక్షా 80 వేల మానిఫెస్టో కాపీలను లోకేష్ ఇంటింటికి పంపిణి చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
Nara Lokesh: లోకేష్ కాన్వాయ్ తనిఖీలు.. లక్షా 80వేల మానిఫెస్టో కాపీలు.. కారణం ఇదేనా..!

Nara Lokesh: తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్‌ని ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీలు చేశారు. అనంతరం కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని వెల్లడించారు. అయితే, మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను లోకేష్ ఇంటింటికి పంపిణి చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read:  వాడు మనిషి కాదు… నరరూప రాక్షసుడు.. పిల్లలను చంపి రక్తం తాగాడు

చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో లక్షా 80వేల మానిఫెస్టో కాపీలను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోకేష్ పోస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఎన్నికల కోడ్ కావడంతో లక్షా 80 వేల మానిఫెస్టో కాపీలను పోస్టల్ శాఖ అధికారులు పంపిణీ చేయకుండా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మంగళగిరి పోస్ట్ ఆఫీసులో 23 బస్తాల్లో తెలుగుదేశం మానిఫెస్టో కాపీలు ఉన్నాయని దీనిపై ఎన్నికల అధికారులకు పోస్టల్ శాఖ అధికారులు సమాచారం ఇస్తామంటున్నారు. కేవలం ఈ సమాచారంతోనే పోలీసులు తనిఖీలు చేశారని అనుమానం వ్యక్తం అవుతోంది.

Also Read: దుమారం రేపిన పచ్చడ్రెస్ నిర్ణయం..వెనక్కు తీసుకున్న యాజమాన్యం

ఇదిలా ఉండగా.. నేడు తిరుపతికి నారా లోకేష్ ఫ్యామిలీ వెళ్లనున్నారని తెలుస్తోంది. రేపు నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా లోకేష్ కుటుంబం శ్రీవారి సేవలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. రేపు ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలలో దేవాన్ష్ పేరుపై ఒక్కరోజు అన్నదానంకు విరాళం కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు భోజనం వితరణ చేయనున్నారు లోకేష్ కుటుంబం.

ఇక మంగళగిరి నియోజకవర్గంలో‌ నారా లోకేష్ మరింత దూకుడు పెంచుతున్నారు. నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తున్నారు. రచ్చబండ, బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ పేరుతో అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు. తాడేపల్లి పరిధిలోని అపర్ణ అమరావతి వన్ అపార్ట్‌మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు