/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Anakapalli-Murder-Case.jpg)
Anakapalli Murder Case: అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. 3 రోజులు దాటినా నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిందితుడు సురేష్ కోసం 12 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సురేష్‌కు ఫోన్ లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రూటు మార్చారు. నిందితుడిని పట్టిస్తే రూ.50 వేలు ఇస్తామని ప్రకటన చేశారు. నిందితుడి వివరాలతో పోస్టర్ల విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లు విడుదల చేశారు. 94407 96084, 94407 96108, 94409 04229, 73826 25531 ఈ నెంబర్లకు వెంటనే సమాచారం అందించి రివార్డు పొందగలరు అని అన్నారు. మరోవైపు నిందితుడికి ఉరిశిక్ష వేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.