AP: పోలవరం టికెట్ రగడ.. అనపర్తి సీటుపై ఉత్కంఠ..!

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పోలవరం టికెట్ జనసేనకు కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అనపర్తి సీటుపై ఉత్కంఠ కొనసాగుతుంది.

New Update
AP: పోలవరం టికెట్ రగడ.. అనపర్తి సీటుపై ఉత్కంఠ..!

TDP Leaders Protest: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ప్రియాంక కన్వెన్షన్ లో టీడీపీ నేతలతో చంద్రబాబు (Chandrababu) సమావేశం ఏర్పాటు చేశారు. అయితే,  మీడియా సమావేశానికి ముందు చంద్రబాబు ఉన్న కన్వెన్షన్ వద్ద పోలవరం టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పోలవరం టికెట్ (Polavaram MLA Seat) జనసేనకు కేటాయించడం పట్ల టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం టికెట్ టీడీపీ ఇంచార్జి బొరగం శ్రీనివాస్ కే ఇవ్వాలంటూ నినాదాలు చేపట్టారు. చంద్రబాబు బస చేస్తున్న కన్వెన్షన్ వద్దే తెలుగుతమ్ముళ్లు నిరసనకు దిగారు. అయితే, ఇటీవలే పోలవరం కూటమి అభ్యర్థిగా అధిష్టానం జనసేన (Janasena) నుంచి చిర్రి బాలరాజు పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: టీడీపీలో చల్లారని అసమ్మతి.. బలప్రదర్శనకు దిగిన బత్యాల..!

తాజాగా, నల్లజర్లలో రాజమండ్రి పార్లమెంటరీ నేతలతో చంద్రబాబు సమావేశమైయ్యారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. చంద్రబాబుతో బేటీ అయ్యారు. ఈ క్రమంలో అనపర్తి సీటుపై చంద్రబాబు ముందు రామకృష్ణారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అధైర్య పడవద్దని  ధైర్యం చెప్పి ..తనకు సానుకూల ప్రకటన వస్తుందని నల్లమిల్లికి చంద్రబాబు హామీ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..!

ఈ నేపథ్యంలో అనపర్తి సీటు గందరగోళంపై నేడు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి రావాలని పార్టీ పెద్దలు అహ్వానించినట్లు సమాచారం. టీడీపీలో తప్ప ఏపార్టీలోకి రానని బీజేపీ నాయకులతో తెల్చి చెప్పినట్లు తెలుస్తోంది. నల్లమిల్లి చంద్రబాబుని కలవడంపై నియోజకవర్గంలో అనపర్తి సీటుపై ఉత్కంఠ కొనసాగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు