TDP: కోడికత్తి డ్రామా కొనసాగింపే ఈ గులకరాయి డ్రామా..
సీఎం జగన్ ఎన్నికల కోసం కొత్తగా గులకరాయి డ్రామాకు తెరలేపారన్నారు పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొరగం శ్రీనివాస్. ఆయనే దాడి చేయించుకొని ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ఈసారి ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు.
TDP Srinivas: పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొరగం శ్రీనివాస్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై రాయి దాడి గురించి స్పందించారు. సీఎం జగన్ ఎన్నికల కోసం కొత్తగా గులకరాయి డ్రామాకు తెరలేపారన్నారు. ఆయనే దాడి చేయించుకొని ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ఈసారి ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. 2019లో కోడికత్తి డ్రామాకి కొనసాగింపే ఈ గులకరాయి డ్రామా అని ఎద్దేవ చేశారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ఈ సారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.
అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది.
అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.
ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.
aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news