PM Modi: ఈ నెల 11న తెలంగాణకు ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన? నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్ కు హాజరైన ప్రధాని మోదీ 4 రోజుల వ్యవధిలోనే మరో సారి రాష్ట్రానికి రానున్నారు. 11న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొననున్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 08 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఈ నెల 11న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. మాదిగ విశ్వరూప సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సభలో ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో అమలవుతున్న దళిత బంధు పథకం తరహాలోనే దళితరత్న పథకాన్ని ప్రధాని మోదీ నిన్న ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ ప్రకటన చేయకుండానే నిన్నటి ప్రధాని ప్రసంగం ముగిసింది. అయితే 11న విశ్వరూప సభలోనే ప్రధాని దళితరత్న పథకానికి సంబంధించిన ప్రకటన కూడా చేస్తారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Telangana politics:ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది? ఎలాగైనా తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తోన్న బీజేపీ ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ ఒకే వారంలో రెండు సార్లు రాష్ట్రానికి వస్తున్నారంటేనే బీజేపీ తెలంగాణ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన కూడా ఇందులో భాగమేనన్న చర్చ సాగుతోంది. మాదిగ సమాజిక వర్గం ఏళ్లుగా పోరాటం చేస్తున్న వర్గీకరణ అంశంపై హామీ ఇవ్వడం ద్వారా భారీగా లబ్ధిపొందవచ్చని బీజేపీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని పర్యటన వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11న సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్పోర్టుకు రానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 5.45 వరకు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నా మాదిగ విశ్వరూప సభలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు మోదీ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. #modi #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి