PM Modi: తెలంగాణలో మోదీ పర్యటన.. అందుకేనా?

ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభలలో పాల్గొంటారు. అలాగే 27న హైదరాబాద్ లో రోడ్ షో చేయనున్నారు మోదీ.

New Update
PM Modi: తెలంగాణలో మోదీ పర్యటన.. అందుకేనా?

Modi Telangana Tour: తెలంగాణలో నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసే అన్నీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గేర్ మార్చి ప్రచారాల్లో టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు రాజకీయ నేతలు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లు ఊరుతున్నారు బీజేపీ(BJP) అగ్రనేతలు. ప్రస్తుత రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ (BRS) పార్టీలు ఒకటే అని ప్రచారం జరుగుతుండగా.. ఆ ప్రచారానికి స్వస్తి పలికేందుకు తెలంగాణ బీజేపీ నేతలు తలాతోకా పట్టుకుంటున్నారు.

ALSO READ: BRSలోకి బీజేపీ కీలక నేత.. ఎవరంటే?

ఇదిలా ఉండగా ప్రచారాల్లో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను పీఎంఓ (PMO) విడుదల చేసింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఎన్నికలకు మూడు రోజుల ముందు వరకు మోదీ తెలంగాణలో పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో పలు నియోజకవర్గాల్లో మోదీ పర్యటించనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభలలో పాల్గొంటారు. 27న హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఎస్సీ డిక్లరేషన్ ను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ పర్యటన దృష్ట్యా తెలంగాణ బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 119 స్థానాలకు గాను బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేనతో పొత్తు ఉన్న క్రమంలో 8 సీట్లను జనసేనకు కేటాయించింది.

ALSO READ: తెలంగాణలో ఒక్క రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు..! 

మరోవైపు బీజేపీ విమర్శలు దాడి పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay). సీఎం కేసీఆర్ (CM KCR) కాంగ్రెస్ నేతలకు డబ్బు సంచులు పంపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ప్రజల్లో ఇమేజ్ లేదని అన్నారు. ధరణిలో కేసీఆర్ భూములే తప్పుగా చూపిస్తున్నాయని సెటైర్ వేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని అన్నారు. మేం అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతాడని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు