PM Modi Nomination: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ ఈరోజు.. షెడ్యూల్ ఇదే! ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి తన నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే వారణాసిలో పర్యటిస్తున్న మోదీ.. ఈరోజు ఉదయం 11:40 గంటలకు నామినేషన్ వేస్తారు. మోదీ వారణాసి నుంచి పోటీచేయడం వరుసగా ఇది మూడోసారి. By KVD Varma 14 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi Nomination: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఆయన అక్కడ ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ప్రధాని మోదీ నామినేషన్‌లో హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా 20 మంది కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. దీంతో పాటు 12 రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటారు. దీనికి ముందుగా ప్రధాని మోదీ సోమవారం వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. కాశీ విశ్వనాథ దేవాలయంలో పూజలు కూడా చేశారు. ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014లో తొలిసారి ఇక్కడి నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2019లో కూడా ఆయన ఈ సీటును గెలుచుకున్నారు. ఇది ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఉదయం 9:10 గంటలకు కాశీలో గంగను పూజిస్తారు ఉదయం 10.15 గంటలకు కాలభైరవుని దర్శనం చేసుకుంటారు ఉదయం 11:40 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు మధ్యాహ్నం 12:15 గంటలకు బీజేపీ కార్యకర్తలతో సమావేశం అవుతారు ప్రధాని మోదీకి ప్రతిపాదకులు వీరే.. PM Modi Nomination: పండిట్ గణేశ్వర్ శాస్త్రి, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్ అనే నలుగురు ప్రధాని మోదీని ప్రతిపాదించనున్నారు. Also Read: 4వ దశ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే నామినేషన్‌కు ముందు గంగాస్నానం.. PM Modi Nomination: నామినేషన్ వేసే ముందు ప్రధాని మోదీ గంగాస్నానం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్‌లో ప్రార్థనలు చేసిన తర్వాత కాలభైరవుడి ఆశీస్సులు తీసుకుంటారు. PM సుమారు 11.40 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ సమయంలో, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా 20 మంది కేంద్ర, యుపి ప్రభుత్వ మంత్రులు ఆయనతో ఉంటారు. ఇది కాకుండా, ప్రధానమంత్రి నామినేషన్ ప్రక్రియలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశం.. PM Modi Nomination: నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధానమంత్రి బీజేపీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. అదే సమయంలో కలెక్టర్ ఆఫీస్‌లో ఎన్డీఏ నేతలతో కూడా ప్రధాన మంత్రి భేటీ అవుతారు. చివరి దశలో అంటే జూన్ 1న వారణాసిలో ఓటింగ్ జరగనుంది. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్.. ప్రధాని నామినేషన్ వేస్తున్న సందర్భంలో ఏపీ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ హుటాహుటిన వారణాసి చేరుకున్నారు. ప్రధాని మోదీ మళ్ళీ గెలుస్తారంటూ నిన్న చెప్పిన పవన్ కళ్యాణ్.. ఈరోజు మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ వారణాసిలో మీడియాతో ఏమన్నారో ఈ వీడియోలో చూడొచ్చు.. VIDEO | Lok Sabha Elections 2024: Here’s what Janasena chief Pawan Kalyan (@PawanKalyan) said after arriving in Varanasi, ahead of PM Modi filing his nomination from the constituency tomorrow. “It’s a sure shot victory for the NDA. It’s an honour to be here beside PM Modi to… pic.twitter.com/Fqd3a9eWo9 — Press Trust of India (@PTI_News) May 13, 2024 #pm-modi #general-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి