ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన రష్యా! రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లిన ప్రధాని మోదీకి మాస్కో విమానాశ్రయంలో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఘన స్వాగతం పలికారు.రేపు భారత్-రష్యా సదస్సులో పుతిన్‌తో మోదీ భేటీకానున్నారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. By Durga Rao 08 Jul 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లిన ప్రధాని మోదీకి మాస్కో విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ స్వాగతం పలికారు.రేపు భారత్-రష్యా సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు.చర్చల అనంతరం రష్యాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఆస్ట్రియాలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అంతకుముందు, X లో ప్రధాని మోదీ చేసిన పోస్ట్‌లో, “ఈ పర్యటన రష్యా, ఆస్ట్రియాతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి గొప్ప అవకాశమని తెలిపారు. నేను రెండు దేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తులతో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నాను. గత 10 ఏళ్లుగా భారత్-రష్యా సంబంధాలు మెరుగయ్యాయి’’ అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. #pm-modi #russia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి