Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్‌ని పారేయకండి..వీటి ప్రయోజనాలు తెలుసుకోండి! ప్లాస్టిక్ బాటిల్స్‌ని పారేయవద్దు. ఇంటి అలంకరణలో ఈ బాటిళ్లను స్మార్ట్ పద్ధతిలో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన ఉపయోగాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 06 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Plastic Bottle: ప్లాస్టిక్ బాటిళ్లను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. వాటిని ఎన్నో రకాలుగా తరచూ బాటిల్ నీళ్లైనా, శీతల పానీయాలైనా ఇంట్లో పారేస్తుంటాం.అయితే అలాంటి ప్టాస్టిక్ బాటిళ్లను పారేయకండి. ఇంటి అలంకరణలో వాడుకోచ్చు. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు, శీతల పానీయాలు వంటివి అందుబాటులో ఉండే ఉంటాయి. చాలామంది ఈ బాటిళ్లను దూరంగా పారేస్తారు. కానీ వీటిని.. ఇంటి అలంకరణలో ఈ బాటిళ్లను స్మార్ట్ పద్ధతిలో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. మరోవైపు..పిల్లలు క్రాఫ్ట్‌లో కొన్ని అలంకార వస్తువులను తయారు చేయాలనుకుంటే..ఈ ఆలోచనల సహాయంతో ఈ ప్లాస్టిక్ బాటిళ్లను అందమైన క్రాఫ్ట్‌లుగా తీర్చిదిద్దవచ్చు. ప్టాస్టిక్ బాటిళ్లను ఎలా వాడుకోవాలి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్లాస్టిక్ బాటిళ్ల ఇలా ఉపయోగించండి: ముందుగా పాత వాటర్ బాటిళ్లను శుభ్రం చేసి వాటికి మీకు నచ్చిన వివిధ రంగులలో పెయింట్ చేయాలి. తరువాత సీసాల మధ్యలో ఓ సన్నని భాగాన్ని కత్తిరించాలి. సీసాలో రెండు చివర్లలో రంధ్రాలు చేయాలి. ఇలా చేసినాక మట్టిని నింపి ఇష్టమైన మొక్కలను అందులో నాటుకోవాలి. తాడు, తీగను కట్టి వేలాడే తోటలా వేలాడదిస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. పెద్ద ప్లాస్టిక్ బాటిల్ పైభాగంలో మూడింట ఒక వంతు కత్తిరించుకోవాలి. ఇప్పుడు యాక్రిలిక్ పెయింట్ సహాయంతో సీసాని పెయింట్ చేయాలి. దానిపై ఇష్టమైన డిజైన్, రూపాన్ని గీసుకోవాలి. ఈ మేకప్ స్టాండ్‌ని డ్రెస్సింగ్ టేబుల్‌పై పెట్టి చినిచిన్న, పెద్ద మేకప్ వస్తువులను అందులో దాచుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్ నుంచి లేబుల్‌ను పూర్తిగా తీసేయాలి. మూత తీసి..బాటిల్‌కి నచ్చిన రంగులతో పెయింట్ చేసుకోవాలి. రెండుసార్లు పెయింట్ చేస్తే ఇంక మంచిది. దీనిని మాస్కింగ్ టేప్‌తో ఏదైనా డిజైన్‌ను కూడా చేయవచ్చు. దీనిని ఇలా పూల కుండగా సిద్ధం చేసుకోవచ్చు. దీనిని మధ్యలో 15-20 సీసాలు కట్ చేసి, కింద భాగాన్ని తీసేయాలి. తరువాత ఇష్టమైన రంగుతో రంగు వేసుకోవాలి. ఫేవి క్విక్‌ని ఉపయోగించి.. షాన్డలియర్ రూపాన్ని వచ్చే విధంగా వాటిని చేసుకోవాలి. వైర్‌తో బల్బును మధ్యలో వేలాడదీస్తే షాన్డిలియర్ సిద్ధం అవుతుంది. సీసా నుంచి పిగ్గీ బ్యాంకు చేయడానికి..దానిని బాగా కడిగి ఆరబెట్టాలి. నాణేలు, రూపాయలు లోపలికి వెళ్లేంత పెద్ద సీసాలో ఒక వైపున కట్ చేసుకోవాలి. ఇష్టమైన చార్ట్ పేపర్‌ను బాటిల్ అంతటా అతికించి..రంగు టేప్‌తో అంచులపై డిజైన్‌లు చేయాలి. విలైతే ఏదైనా కావలసిన ఆకారంలోనూ దీనిని తయారు చేయవచ్చు. ఇది కూడా చదవండి: వీటిని అన్నంలో ఉడికించి తినండి.. గుండె ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #home-tips #plastic-bottles #flower-pot మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి