Valentines Day: ప్రేమ యాత్రలకు పారిస్...ఇటలీ ఏలానో..మన ఉదయ్‌పూర్ అలానే! రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్. దీనిని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్‌లో ఉన్న ఈ నగరం అందంలో పారిస్‌ని కూడా మించిపోయింది. మీ భాగస్వామిని పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకుంటే, ఈ రొమాంటిక్ సిటీ మీకు బెస్ట్ ఆప్షన్. By Bhavana 07 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Udaipur - Best Place for Lovers: మరో కొద్ది రోజుల్లో ప్రేమికుల దినోత్సవం (Valentines Day) జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలో వారం రోజుల ముందు నుంచే ప్రేమికుల హడావిడి మొదలైపోతుంది. మొదటి రోజును గులాబీలతో(Rose Day) ప్రారంభించి చివరిరోజున ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే ప్రేమ పక్షలు హాయిగా విహరించడానికి చాలా మంది విదేశాలను ఎంచుకుంటూంటారు. కానీ మన భారత దేశంలో కూడా ప్రేమికుల కోసం ఓ ప్రత్యేకమైన నగరం ఉందని చాలా మందికి తెలియదు. ఈ నగరం బాలీవుడ్ , హాలీవుడ్ తారలను సైతం మైమరిపించింది. బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) , కత్రినా కైఫ్, రిణీతి చోప్రా తమ పెళ్లి కోసం ఈ నగరాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. తాజాగా ప్రముఖ పాప్ స్టార్ దువా లిపా కూడా సెలవుల కోసం ఈ నగరానికి వచ్చారు. ఇంతకు ఇది ఏ నగరమో మీకు తెలిసిందా? అదేనండి రాజస్థాన్ (Rajasthan )లోని ఉదయ్‌పూర్(Udaipur - City Of Lake) . దీనిని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్‌లో ఉన్న ఈ నగరం అందంలో పారిస్‌ని కూడా మించిపోయింది. ఉదయపూర్‌లో సరస్సుల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే దీనికి 'సిటీ ఆఫ్ లేక్' అని పేరు వచ్చింది. మీరు మీ భాగస్వామిని పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకుంటే, ఈ రొమాంటిక్ సిటీ మీకు బెస్ట్ ఆప్షన్. అదే సమయంలో వివాహితులు, ప్రేమించే జంటలు వాలెంటైన్స్ కోసం తమ భాగస్వామితో కలిసి ఇక్కడకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడాల్సిన ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం! సిటీ ప్యాలెస్ సిటీ ప్యాలెస్‌ని (City Palace) రాజమహల్ అని కూడా అంటారు. పిచోలా సరస్సు ఒడ్డున తెల్లటి పాలరాతితో నిర్మించిన ఈ ప్యాలెస్ పురాతన వాస్తుశిల్పంపై ఆసక్తి ఉన్నవారికి ఆకర్షణీయంగా ఉంది. ఈ ప్యాలెస్ రాజస్థాన్‌లోని భారీ ప్యాలెస్‌లలో ఒకటి. ఈ ప్యాలెస్ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. దీని కోసం ప్రవేశ రుసుము కూడా వసూలు చేస్తారు. లేక్ ప్యాలెస్ లేక్ ప్యాలెస్‌ని 'జల్ మహల్' (Jal Mahal) అని కూడా అంటారు. ఈ అందమైన గ్రాండ్ ప్యాలెస్ పిచోలా సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉంది. దీని చుట్టూ సరస్సు నీరు ఉంది. దీని కారణంగా దీనిని లేక్ ప్యాలెస్ లేక జల్ మహల్ అని పిలుస్తారు. ఈ అందమైన వాటర్ ప్యాలెస్‌ను 1754లో మహారాణా జగత్ సింగ్ II నిర్మించారు. 1950లో ఈ ప్యాలెస్‌ని ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చారు. అప్పటి నుండి నేటి వరకు ఈ అందమైన ప్యాలెస్ హోటల్‌గా ఉంది. ఈ ప్యాలెస్ గోడపై అందమైన పెయింటింగ్స్ వేసి ఉంటాయి. స్నేహితుల తోట ఫతేసాగర్ సరస్సు సమీపంలో నిర్మించిన ఈ తోటలో అందమైన చెట్లు, మొక్కలు, మ్యూజికల్ ఫౌంటైన్‌లు చాలా అందమైన దృశ్యాన్ని అందిస్తాయి. ఉదయపూర్ మహారాజు తన కుటుంబానికి చెందిన మహిళల వినోదం కోసం ఈ తోటను నిర్మించారు. ఈ స్థలం ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. జగ్ మందిర్ ఈ ఆలయం పిచోలా నది ఒడ్డున నిర్మించబడింది. దీనిని 'లేక్ గార్డెన్ ప్యాలెస్' (Lake Garden Palace) అని కూడా అంటారు. మహారాణా అమర్ సింగ్ దీని నిర్మించారు. మాన్‌సూన్ ప్యాలెస్ దీనిని సజ్జన్‌గఢ్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఇది ఉదయపూర్‌లోని ఎత్తైన భవనాలలో ఒకటిగా పరిగణిస్తారు. దీన్ని నిర్మించడం వెనుక కారణం రుతుపవనాల మేఘాలు సమీప ప్రదేశం నుండి చూడవచ్చు. ఇది దాదాపు 132 సంవత్సరాల నాటిది. Also read: రాముడ్ని నల్లగా చేశారు…రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! #rajasthan #valentines-day #udaipur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి