Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కస్టడీ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీల కస్టడీపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను కొట్టేసింది. భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. By V.J Reddy 28 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీల కస్టడీపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను కొట్టేసింది. భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రణీత్ రావును సైతం ఐదు రోజులపాటు కస్టడీకి కోరిన పోలీసులు.. ప్రణీత్‌రావు జుడీషియల్ రిమాండ్ పూర్తి కావడంతో కస్టడీని నాంపల్లి కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం చంచల్‌గూడా జైల్లో ఈ ముగ్గురు నిందితులు ఉన్నారు. ALSO READ: వచ్చే నెల 6న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల ఓ ఎమ్మెల్సీ పాత్ర.. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సినిమాను మించిన ట్విస్టులు నమోదు అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కు ఎస్ఐబీ కన్సల్టెంట్ రవిపాల్ సహకరించారని ఇజ్రాయేల్ నుంచి అత్యాధునిక పరికరాన్ని దిగుమతి చేసుకోవడంలో ఆయన సహకరించారని చర్చ జరుగుతున్న వేళ తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర తెరమీదకు వచ్చిది. ఇజ్రాయిల్లో పరికరాలు కొని హైదరాబాద్ కు రప్పించడంలో ఓ ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషించారని.. తన పలుకుబడి ఉపయోగించి రవిపాల్ తో ట్యాపింగ్ డివైజ్ లను తెప్పించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో సదరు ఎమ్మెల్సీని విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధం అయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాకర్ రావు కొరకు లుక్ అవుట్ నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు కొరకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీస్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యహారం బయపడడంతో ఆయన ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ నేతృత్వంలోనే ఈ ఫోన్స్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని పోలీస్ విచారణలో తేలింది. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ను ఏ1 గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. వెలుగులోకి సంచలన విషయాలు.. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్‌లో SIBకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ కీలకంగా మారారు. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్‌లను తీసుకొచ్చినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. కేంద్రం అనుమతి లేకుండానే ఈ పరికరాలను తీసుకువచ్చినట్లు తేలినట్లు సమాచారం. 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినే అధునాతన డివైజ్‌లను రవిపాల్ దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని ఈ డివైజ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. #phone-tapping-case #ex-dsp-praneeth-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి