Phone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి..!

ఫోన్ బ్యాటరీ పాడవ్వకుండా ఉండాలి అంటే బ్యాటరీని 20% కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేస్తే దాని బ్యాటరీపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. 20 శాతం కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి.

New Update
Phone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి..!

Phone Charging Tips: ప్రస్తుత కాలంలో ఫోన్ అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. ఫోన్ చేతిలో లేకపోతే ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఫోన్స్ విషయంలో చాలా మంది చాలా రకాల తప్పులు చేస్తుంటారు. వాటిలో ముఖ్యమైనది దానికి ఛార్జింగ్ పెట్టడం. అసలు రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలి? ఎంత శాతం వరకు ఛార్జింగ్ పెట్టాలి అనేది చాలా మందికి తెలియదు.

ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని టిప్స్(Phone Charging Tips) పాటిస్తే.. బ్యాటరీ పాడవ్వకుండా ఉండడంతో పాటుగా ఫోన్ చాలా కాలం పనిచేస్తుంది.

చాలా మంది ఫోన్ బ్యాటరీ డౌన్ అయ్యే వరకు యూజ్ చేస్తుంటారు. మరికొందరు ఫోన్ బ్యాటరీ 5 శాతం కంటే తక్కువగా వచ్చేంత వరకు యూజ్ చేస్తుంటారు. అయితే అలా చేస్తే ఫోన్ బ్యాటరీ త్వరగా పాడవుతుంది.

చాలా మంది ఫోన్‌లో 100 శాతం కంటే కొంచె ఛార్జింగ్ తగ్గినా సరే వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. ఫోన్‌ను తరచుగా ఛార్జింగ్ పెడుతూ ఉంటే, కాలక్రమేణా ఫోన్ బ్యాటరీ చెడిపోతుంది.

ఫోన్‌కి ఎన్నిసార్లు ఛార్జింగ్ చేయాలంటే..?

ఫోన్‌ బ్యాటరీని 20% కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేస్తే దాని బ్యాటరీపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. 20 శాతం కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టాలి.

ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ 100 శాతం పూర్తైన వరకు కాకుండా 80 నుంచి 90 శాతం మధ్యలో ఉన్నప్పుడు ఛార్జింగ్ తీసేయాలి. 100 శాతం ఫుల్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ పేలిపోయే పరిస్థితి ఉంటుంది.

Also Read: విమానాల్లో ఫ్రీ వైఫై..ఏ ఎయిర్‌ లైన్స్‌ లోనో తెలుసా!

ఫోన్ ఛార్జింగ్ విషయంలో 20-80 నియమం పాటించాలని చాలా మంది టెక్ నిపుణులు అంటుంటారు. దాని అర్థం ఏంటంటే? బ్యాటరీని 20% వరకు ఖాళీ చేసినప్పుడు దానిని ఛార్జింగ్‌లో పెట్టాలి.. 80% ఛార్జ్ అయినప్పుడు దాన్ని తీసివేయాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు