Guntur : వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఇళ్లలో పెట్రోల్ బాంబులు.. దాడుల కుట్రల వెనుక..

పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తల ఇళ్లపైన గాజు సీసాలు, రాళ్ల బస్తాలను గుర్తించారు పోలీసు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకుని ఏడుగురును అరెస్ట్ చేశారు. అయితే, ఇప్పటికే పల్నాడులో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.

New Update
Guntur : వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఇళ్లలో పెట్రోల్ బాంబులు.. దాడుల కుట్రల వెనుక..

YCP-TDP : పల్నాడు(Palnadu) జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతుంది. రాజకీయం(Politics) రణరంగంగా మారింది. వైసీపీ-టీడీపీ దాడులు చేసుకునేందుకు ఏకంగా పెట్రోల్ బాంబులు రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాలలో పోలీసుల తనిఖీల్లో పెట్రోల్ బాంబులు(Petrol Bombs) బయటపడ్డాయి. టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తల ఇళ్లపైన దాడులకోసం ఉంచిన గాజు సీసాలు, రాళ్ల బస్తాలను గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేశారు.

Also Read: ఎమ్మెల్యే అభ్యర్థి దాడి కేసులో 13 మంది అరెస్ట్.. అన్యాయంగా తమ వారిని ఇరికించారంటున్న బాధిత మహిళలు..!

ఘటనపై ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ.. దాడుల కుట్రల వెనుక ఎవరున్నారో విచారణలో తేలుతుందన్నారు. నిందితులను వదిలిపెట్టేదే లేదన్నారు. పెట్రోల్ బాంబులు తయారుచేస్తున్న వ్యక్తిని గుర్తించామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రాజకీయ కక్షతో భగ్గుమంటున్న పల్నాడులో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు