ఇప్పుడు పశువుల డాక్టర్‌ అయితే..అప్పుడు దేవతలా డాక్టరా?

టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే..చనిపోయిన వారి తల్లిదండ్రుల ఆత్మలు ఎంతో క్షోభకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీలోని నేతలు అందరూ కూడా కులం అనే జాడ్యం, అహంకారం, పెత్తందారీ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

New Update
AP News: చంద్రబాబు దోస్తులంతా దొంగలే.. డ్రగ్స్ వ్యవహారంపై పేర్ని నాని సంచలన ఆరోపణలు!

నారా లోకేష్‌ గన్నవరం వేదికగా వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీల మీద విరుచుకుపడ్డారు. ఈ విషయం గురించి వైసీపీనేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఆయన మండిపడ్డారు. దమ్ముంటే లోకేష్‌ గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు.

టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే..చనిపోయిన వారి తల్లిదండ్రుల ఆత్మలు ఎంతో క్షోభకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీలోని నేతలు అందరూ కూడా కులం అనే జాడ్యం, అహంకారం, పెత్తందారీ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుకి తన కొడుకుని పెంచడం చేత కాలేదని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకునే పెద్ద మనిషి కొడుకు సంస్కారహీనంగా పెరిగాడని పేర్కొన్నారు. లోకేష్‌ నిర్వహిస్తున్న యాత్ర పేరు యువ గళం కాదు..యువగంగాళం అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు పేర్లు మార్చి టీడీపీ వాళ్లు చెబుతున్నారని అన్ఆనరు.

ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో..ఏమి ఇస్తామో చెప్పకుండా నేను మూర్ఖుణ్ణి..నా త్రండి మంచోడ్ని అని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ని జైలులో పెడితే ఆయన మౌనంగా బాధను భరించారు కానీ..సోనియాని జైల్లో పెడతా..బాబుని జైల్లో పెడతా అని చెప్పలేదన్నారు.

జగన్ ప్రజలకు ఏమి చేస్తాను అనేది ఎన్నికల సమయంలో వివరించారు.అదే అధికారంలోకి రాగానే చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు గన్నవరం ఎమ్మెల్యే వంశీని పశువుల డాక్టర్ అంటున్నారు. ఆయన మీ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చారు. మరి ఆ సమయంలో ఆయనేమన్నా మనుషుల డాక్టర్‌..దేవతలా డాక్టర్ గా ఉన్నారా అని ప్రశ్నించారు.

కొడాలి నాని కూడా టీడీపీలో ఉన్న సమయంలో ఏమైనా ఇంజినీర్‌ గా పనిచేస్తున్నారా అని ప్రశ్నిచారు, ఆయన ఒక మంత్రిగా చేశారు.ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.అలాంటి వ్యక్తిని పట్టుకుని లారీ క్లీనర్..కప్పులు కడిగేవాడు అని పేర్కొవడం ఏమి బాగాలేదు అని ఆయన అన్నారు.

తండ్రీ కొడుకులకు ఆవగింజంత సిగ్గు, దోస గింజంత ఆత్మాభిమానం ఉంటే గుడివాడలో మీకు అభ్యర్ధి ఎవరో చెప్పాలని పేర్ని నిలదీశారు. బట్టలూడదీసి చూసే అలవాటు ఏమిటన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ షాపులో ఉన్న కిరాణా సరుకులు అమ్ముకోవడం కోసం రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, చంద్రన్న కానుక పథకాలు పెట్టారని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment