India Post Scam: ఈ లింక్ ఓపెన్ చేస్తే ఖాతాలోని సొమ్ము ఖతం! ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే మెసేజ్ క్లిక్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. స్కామర్లు తమ వద్దకు ఓ పార్శిల్ వచ్చిందని, అది తప్పుడు అడ్రస్ తో ఉంది, కావున వెంటనే అడ్రస్ అప్డేట్ చేయాలి అని కోరుతూ మీ డేటా మొత్తం దోచేస్తారు. By Lok Prakash 05 Jul 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి India Post Scam: మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త పద్ధతులను కనుగొంటున్నారు. ఈ క్రమంలోనే స్కామర్లు మరోసారి కొత్త పద్ధతిని మొదలుపెట్టారు. ఇందులో మోసగాళ్లు ఎస్ ఎంఎస్ లు పంపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో, వినియోగదారులు తమ చిరునామాను అప్డేట్ చేయాల్సిందిగా కోరతారు. దీని తరువాత, వినియోగదారుల డేటా మొత్తం స్కామర్లు దోచేస్తారు. ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పీఐబీ వినియోగదారులను కూడా కోరింది. ప్రభుత్వం అప్రమత్తం PIB కొంతకాలం క్రితం X లో పోస్ట్ చేసింది. వినియోగదారులకు ప్రభుత్వం నుండి అలాంటి సందేశం ఏదీ పంపబడదని, అందులో తమ చిరునామాను అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం ఎవ్వరిని కోరాదు అని ఆ పోస్ట్ లో తెలిపారు. ఎవరికైనా అలాంటి మెసేజ్ వస్తే అది పూర్తిగా మోసాల జాబితాలోకి వస్తుంది. SMS పంపబడుతుందా? స్కామర్ల ద్వారా SMSలు పంపబడుతున్నాయి, ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే ఆ మెసేజ్ లో తమకి ఒక పోస్ట్ వచ్చింది అని అందులో అడ్రస్ తప్పు ఉంది అని చెప్తారు. తర్వాత వినియోగదారులను అడ్రస్ ను అప్‌డేట్ చేయమని కోరతారు. Also Read: పవన్ కు హరిరామజోగయ్య మరో లేఖ! లింక్ ద్వారా జరుగుతున్న స్కామ్ ఆ మెసెజ్ తో పాటు లింక్ కూడా ఉంటుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు, చాలా వ్యక్తిగత సమాచారం అడుగుతుంది. ఆ సమాచారం అందించిన వెంటనే స్కామర్లు మీ డేటా మొత్తం చోరీ చేస్తారు, మీ బ్యాంకు ఖతా కూడా ఖాళీ చేసేస్తారు. #india-post-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి