హరిరామజోగయ్య లేఖకు పవన్ రిప్లై.. సీఎం అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు!

మాజీ మంత్రి హరిరామజోగయ్య పవన్‌ కి రాసిన బహిరంగ లేఖకు సమాధానం వచ్చినట్లు ఆయన మరో లేఖను విడుదల చేశారు. అందులో పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి పదవి గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపినట్లు వివరించారు.

New Update
హరిరామజోగయ్య లేఖకు పవన్ రిప్లై.. సీఎం అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు!

శుక్రవారం ఉదయం మాజీ మంత్రి , కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య (Hariramajogayya) జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) కి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అందులో ఆయన పవన్‌ కు పలు ప్రశ్నలు సంధించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే కచ్చితంగా చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాని లోకేష్‌ బాబు ప్రకటించడం గురించి ఆయన పలు ప్రశ్నలను పవన్‌ ని వేశారు.

జనసైనికులు, బలహీన వర్గాల వారు పవన్‌ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, వారికి పవన్‌ ఏం సమాధానం చెబుతారంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ” చంద్రబాబే (Chandrababu) కాబోయే ముఖ్యమంత్రి ..ఈ నిర్ణయంలో రెండో మాట లేదు..అనుభవమున్న నాయకుని నాయకత్వమే రాష్ట్రానికి కావాలని పవన్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు.

publive-image

కాబట్టి అదే అందరి మాట అంటూ లోకేష్‌ బాబు (Nara Lokesh) ప్రకటించేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. లోకేష్‌ బాబు ఆశిస్తున్నట్లు చంద్రబాబునే పూర్తి కాలం ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారా? దానికి మీ ఆమోదం ఉందా? అంటూ ఆయన పవన్‌ ని ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి (AP CM) కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జనసైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు? అంటూ హరిరామ జోగయ్య లేఖలో పవన్‌ ని ప్రశ్నించారు.

నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మీ నుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులందరకీ అర్థమయ్యేలే చెప్పాల్సిందిగా కోరుతున్నాం అంటూ ఆయన పవన్‌ కి లేఖ రాశారు.

తాజాగా దీని గురించి హరిరామజోగయ్య మరో లేఖను విడుదల చేశారు. అందులో పవన్‌ నుంచి సమాధానం వచ్చిందని పేర్కొన్నారు. కాబోయే ముఖ్యమంత్రి గురించి ఇంకా క్లారిటీ లేదని ఆయన పేర్కొన్నట్లు వివరించారు. లోకేష్‌ ప్రకటించినట్లుగా కాక '' ఎన్నికలైన తరువాతనే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుంది'' అంటూ గతంలో అనేక పర్యాయములు తాను చేసిన ప్రకటనకే ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నట్లుగాను, లోకేష్‌ ప్రకటించినట్లుగా ముఖ్యమంత్రిగా ఫలానా వారు అనే నిర్ణయమేమి ఇంతవరకు జరగలేదని నేను రాసిన ఉత్తరంలోని ప్రశ్నలకు పవన్‌ కల్యాణ్‌ గారి నుంచి నాకు సమాధానం అందింది. వారి యొక్క ఈ భావాలను త్వరలోనే సమయం వచ్చినప్పడు జనం ముందు పెడతారని ఆశిద్దాం.

అయితే ఎన్నికలైన తరువాత ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలంటే తెలుగుదేశాన్ని శాసించగల శాసనసభ్యులు అవసరం అనేది పవన్‌ కల్యాణ్‌ గారికి తెలియంది కాదు. దీనికి గాను 2019 ఎన్నికల్లో 10 వేలకు మించిన ఓట్లు జనసేన అభ్యర్థులకు పడి యున్న 60 నియోజకవర్గాలైన ఈనాడు జనసేన పార్టీ దక్కించుకోవలసి యుంది.

ఈ 60 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నమాట వాస్తవం. కనుక 60 సీట్లకు తక్కువ కాకుండా దక్కించుకోగలగడం పవన్‌ వంతు. వాటిని గెలిపించుకోవడం జనసైనికుల వంతు అని చెబుతూ జనసైనికులందరూ ఓపికగా ఉండి టీడీపీ నేతల మాటలను పక్కన పెట్టి అధికారంలో భాగస్వాములం కావటమే లక్ష్యంగా జనసేన, టీడీపీ కూటమి విజయానికి కృషి చేయాల్సిందిగా వారిని కోరుతున్నాను '' అంటూ హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

Also read: మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 24 కోట్ల కంప్యూటర్లపై ఎఫెక్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు