జగన్ నిన్ను కేంద్రం చేత ఓ ఆట ఆటాడిస్తా: పవన్

ప్రశాంతమైన విశాఖలో ప్రస్తుతం గుండాలు రాజ్యమేలుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించారు. వారాహియాత్ర మూడో దశ ప్రారంభం సందర్భంగా విశాఖ వచ్చిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

New Update
జగన్ నిన్ను కేంద్రం చేత ఓ ఆట ఆటాడిస్తా: పవన్

వారాహియాత్ర మూడో దశలో ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ నిన్ను కేంద్రం చేత ఓ ఆట ఆడించకపోతే నన్ను అడుగు.. జగన్ అనే వాడు నాయకుడు కాదు.. వ్యాపారి అంటూ పరుష పదజాలంతో విమర్శించారు. ఇక్కడ దోపిడీ చేస్తున్న వైసీసీ ఎమ్మెల్యేలు అందరి జాతకాలు కేంద్రం వద్ద ఉన్నాయని హెచ్చరించారు.   ప్రశాంతమైన విశాఖలో ప్రస్తుతం గుండాలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. అలాంటి గుండాలు నుంచి రక్షించాడానికి ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నారు. గుండాలకు తాము బెదిరిపోమన్నారు. విశాఖ జిల్లాను వైసీపీ విముక్త ప్రాంతంగా చేస్తామని.. చొక్కాలు పట్టుకుని నిలదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాలంకు రంగు రుచి ఉండదు కాలంతో పాటు ఎవ్వరైనా పరుగెత్తాల్సిందేన్నారు. ఉదయం పథకాలు కింద ఖాతాల్లో డబ్బులు వేసి.. సాయంత్రం సారా కింద పట్టుకుపోతున్నారన్నారు.

సుస్వాగతం సినిమా కోసం గతంలో జగదాంబ సెంటర్ వచ్చానని.. మళ్లీ వారాహి వాహనం ఎక్కి ఈ సెంటర్‌కు విచ్చేశానని తెలిపారు. తనలో ఉన్న సిగ్గు భయం పోగొట్టి నటన నేర్పి అన్నం పెట్టింది విశాఖ నగరమని తెలిపారు. సీఎం జగన్‌తో సహా ఎవరికీ మీరు భయపడవద్దని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోయి మంగళగిరి కార్యాలయంలో బాధలో కూర్చుని ఉన్నప్పుడు విశాఖ నాకు ధైర్యం ఇచ్చిందన్నారు. విశాఖ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలన్నారు. ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైసీపీ బెదిరింపులకు తాను భయపడనని.. ఏపీ నేల నుంచి వైసీపీని తరిమికొట్టే దాకా పోరాటం ఆపనని స్పష్టంచేశారు. 60శాతం ఉన్న యువతను సరైన మార్గంలో నడిపే నాయకుడు కావాలన్నారు.

రాష్ట్రంలో మహిళలు కనిపించకుండా పోయారని గతంలో తాను చెబితే ప్రతి వైసీపీ నాయకుడు బూతులు తిట్టారని తెలిపారు. తాను చెప్పిన మాటలనే పార్లమెంట్ వేదికగా కేంద్రమంత్రి చెప్పారని గుర్తుచేశారు. సీఎం జగన్ పదే పదే తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని.. మీరు తనను వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినా భయపడే వ్యక్తిని కాదన్నారు. వాలంటీర్లు అంటే తనకు ఎంతో ప్రేమ అని.. సోదరీ, సోదరమణులతో సమానమన్నారు. దయచేసి జగన్ మాయలో పడి వాలంటీర్లు డేటా చౌర్యం చేయవద్దని సూచించారు.

ఏపీ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిపోయిందన్నారు. గతంలో గంజాయి తోటలను తగలబెట్టిన గౌతమ్‌ సవాంగ్‌ను డీజీపీ నుంచి బదిలీ చేశారన్నారు. ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపేసి డోర్‌ డెలివరీ చేస్తే దిక్కు లేదని విమర్శించారు. విశాఖ ఎంపీని సాక్షాత్తూ ఓ రౌడీ కిడ్నాప్ చేస్తే సీఎం స్పందించలేదని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మరోసారి సీఎం అయితే ఇక అంతే సంగతులని పవన్ ప్రజలను అప్రమత్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు