పవర్ స్టార్ నినాదాలతో దద్దరిల్లుతోన్న థియేటర్లు..'బ్రో' ట్విట్టర్ రివ్యూ ఏంటంటే..? తాజాగా రిలీజైన పవన్ కొత్త సినిమా 'బ్రో' పై ట్విట్టర్లో నెటిజన్ల రివ్యూ డివైడ్‌గా కనిపిస్తోంది. కొందరు సినిమా అదిరిపోయిందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఇది కేవలం పవన్ ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమాగా ట్వీట్లు పెడుతున్నారు. By Trinath 28 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి పవన్(Pawan kalyan) అభిమానులకు ఇది నిజంగా పండుగ రోజే..నిజంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే.. పవర్‌స్టార్(Power star)ని దేవుడిగా కొలిచే వాళ్లు ఎంతమంది ఉంటారో లెక్కబెట్టడం కష్టమే.. ఓవైపు పాలిటిక్స్‌లో బహిరంగ సభలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ అటు సినిమాల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా రిలీజైన పవన్ కొత్త సినిమా 'బ్రో'(BRO) తమకు ఫుల్ మీల్స్ పెట్టిందంటున్నారు ఫ్యాన్స్. పవన్‌ని చూస్తున్నంత సేపు థియేటర్ల(Theatre)లో చూపు తిప్పుకోలేకపోయామని చెబుతున్నారు. ఎప్పటిలాగే అమెరికాలో ప్రీమియర్ షో పడిపోగా.. పవర్‌స్టార్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అరుపులు, ఈలలు, గోలలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికా, యూకేలలో కూడా పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇంతకి 'బ్రో' ట్విట్టర్(twitter) రివ్యూ(review) ఎలా ఉంది..? #BroTheAvatar Review: ⭐⭐⭐#PawanKalyan Show all the way 💥 Dialogues And Racy Screenplay 👌 Thamman BGM ❤️🔥 Decent 1st and Good 2nd Half👍 Overall Hit Cinema ✅#BroTheAvathar #BroMovieReview #Bro — Thyview (@Thyveiw) July 28, 2023 ట్విట్టర్లో టాక్ ఎలా ఉందంటే..? నిజానికి ప్రీమియర్ షోలకు వెళ్లే వాళ్లలో దాదాపుగా అంతా సంబంధిత హీరో అభిమానులే ఉంటారు. అందులో పవన్‌కి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సినిమా చూసినంత సేపు గోల చేయడం.. మూవీ అయిపోయిన తర్వాత ట్విట్టర్లో రివ్యూ పెట్టడం ఫ్యాన్స్‌కి అలవాటు. సముద్ర ఖని తెరకెక్కించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. హీరో సాయి ధరమ్ తేజ్ పవన్‌తో కలిసి అలరించాడంటున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని.. సెకండ్ హాఫ్ బాగుందని కొందరు ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఫస్ట్ హాఫ్ బాగుందని..సెకండ్ హాఫ్ డల్ ఐపోయిందంటున్నారు. Strictly for fans, others avoid it 2/5 #BROtheAvatar — Peter (@urstrulyPeter) July 27, 2023 ఇంకొందరు మాత్రం ఈ సినిమా కేవలం పవన్ ఫ్యాన్స్ కోసమేనని.. మిగిలిన వాళ్లు చూడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సినిమా బాగుంది కానీ.. ఓవరాల్‌గా మూవీలో చాలా ఫాల్ట్స్ ఉన్నాయంటున్నారు. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం సినిమాకు ఒక్కసారైనా వెళ్లాలని మరికొందరు అభిపాయప్రడుతున్నారు. ఇక సినిమా గురించి రకరకాల పోస్టులు కనపిస్తుండగా..అందరూ మాత్రం పవన్ యాక్టింగ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో పవన్ మాటలు హార్ట్‌కి కనెక్ట్ ఐనట్టు చెబుతున్నారు. పవన్ ట్రేడ్ మార్క్ డైలాగులు కూడా ఉన్నాయని.. అటు పొలిటికల్‌గానూ పవన్‌స్టార్ కోసం డైలాగులు రాసినట్టు చెప్పుకుంటున్నారు. #Bro Overall the movie had a few good moments but falters overall! Had an interesting storyline with few entertaining scenes/many PK fan moments. However, the rest lacks connect with weak writing and emotions that don’t work. Catered for fans only. Rating: 2.5/5 #BroTheAvatar — Venky Reviews (@venkyreviews) July 27, 2023 బీజీఎంపై డిఫరెంట్ టాక్: మరోవైపు థమన్ బీజీఎం, మ్యూజిక్‌పై డివైడ్ టాక్ వినిపిస్తోంది. కొంతమంది థమన్ బీజీఎం హైలైట్ అంటుండగా..అంత గొప్పగా ఏమీ లేదని..పాటలు కూడా యావరేజ్‌గా ఉన్నాయంటున్నారు. ఇక పవన్ పొలిటికల్ మైలేజీ కోసమే త్రివిక్రమ్ కొన్ని డైలాగులు రాసినట్టు తెలుస్తోంది. అటు పవన్ ఇంట్రడక్షన్ కూడా వీర లెవల్లో ఉందని.. ఇది తన కెరీర్లో బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అని కొంతమంది చెబుతుండగా.. గత సినిమాలు లాగానే పవర్ స్టార్ ఇంట్రో ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా కొంతమంది ఒకలా.. మరి కొంతమంది మరోలా ట్వీట్లు పెడుతూ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో రచ్చ చేస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి