Pawan Kalyan: పవన్ క‌ళ్యాణ్‌కు వ‌దిన‌మ్మ సురేఖ బ‌హుమ‌తి.. ఏం ఇచ్చారో తెలుసా?

ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్‌కు వ‌దిన‌మ్మ సురేఖ పెన్ ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. ప‌వ‌న్ చొక్కాజేబులో ఆమె స్వయంగా పెన్ ను పెట్టడం వీడియోలో క‌నిపిస్తుంది.

New Update
Pawan Kalyan: పవన్ క‌ళ్యాణ్‌కు వ‌దిన‌మ్మ సురేఖ బ‌హుమ‌తి.. ఏం ఇచ్చారో తెలుసా?

Surekha Konidela Gift to Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవల ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మెగా ఫ్యామిలీ ఆయ‌న‌కు ఏ విధంగా శుభాకాంక్షలు తెలిపారో మనకు తెలిసిన సంగతే. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) స‌హా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ ఆయ‌న‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పి, ఆయ‌న విజ‌యాన్ని ఘనంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Also Read: ఈ విషయం జీవితంలో మర్చిపోలేను.. టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.!

అయితే తాజాగా, పవన్ క‌ళ్యాణ్‌కు వ‌దిన‌మ్మ సురేఖ ఓ పెన్ ను బ‌హుమ‌తి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. ప‌వ‌న్ చొక్కాజేబులో ఆమె స్వయంగా పెన్ ను పెట్టడం వీడియోలో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా (AP Deputy CM) నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు