Pawan vs Volunteers: పవన్‌పై మండిపడుతున్న మహిళా వాలంటీర్లు.. జనసేన అధినేతలకు మహిళా కమిషన్ నోటీసులు ఏపీలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. తాజాగా ఏపీ మహిళా కమిషన్ పవన్‌కి నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని కోరింది.. 10 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీస్‌లో పేర్కొంది. By Trinath 10 Jul 2023 in పశ్చిమ గోదావరి Scrolling New Update షేర్ చేయండి ఏలూరు బహిరంగా సభలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓవైపు పవన్ టార్గెట్‌గా వైసీపీ నేతలు మాటల తుటాలు పేల్చుతుంటే మరోవైపు మహిళా వాలంటీర్లు జనసేనానిపై మండిపడుతున్నారు. పవన్ తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యల్లో అసలు అనువంతైన నిజం లేదని ఫైర్ అవుతున్నారు. కరోనా సమయంలో..అందరూ ఇళ్లలోనే ఉండిపోయిన సమయంలో తాము మాత్రమే బయటకు వచ్చి ప్రజలకు సేవ చేశామన్న విషయం మరవద్దన్నారు. సాక్ష్యాలు ఉంటే చూపించాలని..అంతేకాని నోటికి వచ్చింది మాట్లాడవద్దని చురకలంటిస్తున్నారు. పవన్ ఏమన్నాడంటే: రెండవ విడత వారాహి యాత్రను ఏలూరు నుంచి ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై విమర్శలు చేసే క్రమంలో వాలంటీర్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. గ్రామాల్లోని వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా, వితంతువులున్నారా లేదా అనే వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతోంది. పవన్ పై మహిళా వాలంటీర్ల ఆగ్రహం క్షమాపణ చెప్పాల్సిందే: పవన్ వ్యాఖ్యలపై దాదాపు అన్ని జిల్లాల్లోని వాలంటీర్లు నిరసనకు దిగారు. పవన్ దిష్టి బొమ్మల్ని దగ్దం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న తమను పవన్ ఇన్నేసి మాటలు ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లకు రాజకీయాల్ని ఆపాదించి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ అవమానించడం దారుణమని మండిపడుతున్నారు. రాజకీయాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని.. అనవసరంగా తమపై బురద జల్లే కార్యక్రమం మాత్రం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని.. ఎక్కడో నిలబడి.. ఏదో మాట్లాడితే సరిపోదు అని.. నిజనిజాలు తెలుసుకోని మాట్లాడితే మంచిదంటున్నారు. పవన్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్చ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు పవన్ టార్గెట్‌గా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కేంద్రం దగ్గర సమాచారం ఉంటే..నిఘా సంస్థల ద్వారా దర్యాప్తు చేసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. పవన్‌కు మహిళా కమిషన్ నోటిసులు: పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కామెంట్స్‌పై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. పవన్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి