Pawan kalyan: వాలంటీర్లపై మరోసారి పవన్‌ సంచలన వ్యాఖ్యలు..అందరి గురించి కాదంటూనే..!

వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థ అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించేందుకు ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేంటని ప్రశ్నించారు.

New Update
Pawan kalyan: వాలంటీర్లపై మరోసారి పవన్‌ సంచలన వ్యాఖ్యలు..అందరి గురించి కాదంటూనే..!

వాలంటీర్లపై ఏలూరు బహిరంగ సభలో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యల వేడి చల్లారకముందే పవన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల డేటాను దొంగిలిస్తున్నారు.. ఇంట్లో ఎంత మంది ఉంటారు.. పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారా లేదా.. భర్త బయటకు వెళ్లినప్పుడు భార్య ఏం చేస్తుంది.. భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు లాంటి వివరాలు వాలంటీర్లకు ఎందుకని ప్రశ్నించారు. అందరూ వాలంటీర్లు అలా లేరంటునే..వాళ్ల వ్యవస్థను తప్పుబట్టారు. కలెక్టర్లు.. ఎమ్మోర్వోలు లాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు మరో సమాంతర వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కడికో పోతుందని.. జగన్‌ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకురావడానికి వేరే ఉద్దేశం ఉండవచ్చు అని.. అది పార్టీని బలపేతం చేసుకునేందుకు కావొచ్చు అని.. ఇలా డేటా చోరీకి మాత్రం కాదంటూ విమర్శలు గుప్పించారు.

మరోసారి మంట..!
ఓవైపు ఏలూరు సభలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మంటలు చల్లారకముందే జనసేన అధినేత మరో బాంబ్‌ పేల్చారు. తన మాటలను సమర్ధించుకుంటున్నట్టు నేరుగా చెప్పకపోయినా.. అదే అర్థం వచ్చేలాగా మారోసారి వ్యాఖ్యాలు చేయడంతో వాలంటీర్లు మరింత ఫైర్ అవుతున్నారు. క్షమాపణ చెప్పమని కోరితే మళ్లీ మళ్లీ అవే మాటలు మాట్లాడడం ఏంటని మండిపడుతున్నారు. అయితే నన్నటి వ్యాఖ్యలతో పోల్చితే పవన్‌ కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను చెప్పేది అందరు వాలంటీర్ల గురించి కాదని చెప్పడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. డేటా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తోందంటూ తాజాగా వ్యాఖ్యానించిన పవన్‌..నిన్న మాత్రం సంఘ విద్రోహ శక్తుల చేతిలోకి వెళ్తుందంటూ కామెంట్స్ చేశారు. 5వేల రూపాయలు జీతం తీసుకొని పది మంది ఇంటింటికీ తిరుగుతుంటే ఎలా అని ప్రశ్నించారు పవన్‌.

నిరసనలు పెరుగుతుయా..?
పవన్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలకు దిగారు..పవన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అదే సమయంలో ఏపీ మహిళా కమిషన్‌ పవన్‌కి నోటిసులు పంపింది. సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని.. ఏ ప్రతిపాదికన ఈ కామెంట్స్ చేశారో చెప్పాలని కోరింది. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు.. ముఖ్యంగా మహిళా వాలంటీర్లు పవన్‌పై ఫైర్ అవుతున్న సమయంలో పవన్‌ మరోసారి వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అటు తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను పట్టించుకోనని పవన్‌ చెప్పారు. బయటకొస్తే తిరిగి ఇంటికి వెళ్తానో లేదో తనకు తెలియదని, కానీ తాను ఎవరికీ భయపడబోనన్నారు. గత ఎన్నికల్లో కూడా తాను వైసీపీకి ఓట్లు వేయొద్దని చెప్పానని, కానీ ప్రజలు వినలేదని, ఈసారి కూడా అదే చెబుతున్నానని, హలో ఏపీ-బైబై వైసీపీ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు పవన్ .

Advertisment
Advertisment
తాజా కథనాలు