Naresh Pavitra Lokesh: లేటు వయసులో ఇదేం ప్రేమరా బాబూ.. పబ్లిక్‌గా నరేష్‌కు ముద్దు పెట్టిన పవిత్ర

సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ గురించి తెలియని వారుండరూ. వారి ప్రేమ వ్యవహారం అలాంటిది మరి. లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇద్దరు తమ భాగస్వాములతో విడిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథతో ఏకంగా 'మళ్లీపెళ్లి' సినిమా కూడా తీశారు.

New Update
Naresh Pavitra Lokesh: లేటు వయసులో ఇదేం ప్రేమరా బాబూ.. పబ్లిక్‌గా నరేష్‌కు ముద్దు పెట్టిన పవిత్ర

సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ గురించి తెలియని వారుండరూ. వారి ప్రేమ వ్యవహారం అలాంటిది మరి. లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇద్దరు తమ భాగస్వాములతో విడిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథతో ఏకంగా 'మళ్లీపెళ్లి' సినిమా కూడా తీశారు. ఆ మూవీ ప్రమోషన్స్‌లో వీరిద్దరు చేసిన రచ్చ అంతాఇంత కాదు. తాజాగా ఓ టీవీ షో వీరు చేసిన రొమాన్స్ మామాలుగా లేదు. ఆ షోలో పబ్లిక్‌గా నరేష్ బుగ్గ మీద పవిత్ర ముద్దు పెట్టారు. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయిపోయారు. అంతలా వీరు ప్రేమను ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాదండోయ్.. ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.

వినాయకచవితి పండుగను పురస్కరించుకుని ఈటీవీ ఛానల్ కోసం మల్లెమాల సంస్థ రూపొందించిన 'స్వామి రా రా' కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా నరేష్, పవిత్ర విచ్చేశారు. ముద్దు, డ్యాన్స్ చేయడమే కాదు.. ముద్దు పేర్లతో కూడా పిలుచుకున్నారు. నరేష్‌ను తాను రాయ అని పిలుస్తానని పవిత్ర చెప్పారు. ఆ వెంటనే 'హైపర్' ఆది తాను రసరాయ అని పిలుస్తా అంటూ పంచ్ వేశారు. మళ్లీపెళ్లి మూవీలో నరేష్ పేరుకు ముందు 'నవరసరాయ' అని ట్యాగ్ వేశారు. అందులో చివరి రెండు అక్షరాలను నరేష్ ముద్దుపేరుగా పెట్టారన్న మాట పవిత్ర. అలాగే పవిత్రను నరేష్ 'బేబీ' అని పిలిచారు. ఈ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ షోలో హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, చాందిని చౌదరి, కమెడియన్ బిత్తిరి సత్తి కూడా పాల్గొని సందడి చేశారు.

ఇక మళ్లీపెళ్లి విషయానికి వస్తే నరేష్ మూడో భార్య రమ్యరఘుపతి మీద రివేంజ్ తీర్చుకోవడానికి కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసినట్లు ఉందని విమర్శలు వచ్చాయి. ఈ సినిమా చూసిన ఎవరికైనా ఆ విమర్శలు నిజం అనిపిస్తాయి. ఎందుకంటే కేవలం డబ్బు కోసమే రమ్యరఘుపతి నరేష్‌ను పెళ్లి చేసుకున్నారని ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాలో చూపించారు. అంతేకాకుండా భర్త నుంచి నిరాదరణకు గురై, జీవితంలో మోసపోయానని ఫీలవుతున్న పవిత్రాలోకేష్.. ఆ సమయంలో పరిచయమైన నరేష్‌కు దగ్గరైనట్లు చిత్రీకరించారు. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు