TDP: టీడీపీలో పరిటాల కుటుంబ తీరుపై ఉత్కంఠ..! టీడీపీలో పరిటాల కుటుంబ తీరు ఉత్కంఠ రేపుతోంది. ధర్మవరం అభ్యర్థి ప్రకటన వరకు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ మౌనంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సీటు తమకు ఇస్తే ఓకేనని లేదంటే తమకు అనుకూలమైన వారికే సీటు ఇవ్వాలని పరిటాల ఫ్యామిలీ పట్టుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 26 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Paritala Sriram: టీడీపీలో పరిటాల కుటుంబ తీరు ఉత్కంఠ రేపుతోంది. ధర్మవరం సీటు కోసం శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. లేదంటే సత్యకుమార్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, సీటెవరికన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ప్రకటన వరకు వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. Also Read: మనుషులందరికీ షాకింగ్ న్యూస్.. బర్డ్‌ఫ్లూతో విద్యార్థి మరణం! ధర్మవరం టికెట్ తమకు ఇస్తే ఓకేనని లేదంటే తమకు అనుకూలమైన వారికే సీటు ఇవ్వాలని పరిటాల కుటుంబం పట్టుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మరొకరికి సీటు ఇస్తే శ్రీరామ్ ఏం చేస్తారన్న ఆసక్తి నెలకొంది. శ్రీరామ్‌కు సీటు రాకపోతే మరి సునీత రియాక్షన్ ఏలా ఉండబోతుందోనని స్ధానిక రాజకీయ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా శ్రీరామ్ రాజకీయ భవిష్యత్తుపై పరిటాల వర్గంలో టెన్షన్ కనిపిస్తోంది. #ananthapuram #paritala-family మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి