Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్‌గా గగన్ నారంగ్.. జూలై 26న ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు భారత బృందం అన్ని రకాలుగా సిద్ధం అయింది. షూటర్ గగన్ నారంగ్‌ను భారత బృందానికి చెఫ్ దే మిషన్‌గా నియమించారు. ఇంతకు ముందు ఈ స్థానంలో బాక్సర్ మేరీ కోమ్ ఉండేవారు. By Manogna alamuru 08 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Shooter Gagan narang: మరికొన్ని రోజుల్లో పారిస్ ఒలంపిక్స్ మొదలుకానున్నాయి. దీనికి భారత అథ్లేట్లు సంసిద్ధమయ్యారు. పలు విభాగా నుంచి క్రీడాకారులను ఎంపిక చేశారు. జూలై 26న పారిస్ ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. దీనికి చెఫ్ దే మిషన్‌గా షూటర్ గగన్ నారంగ్‌ను నియమించింది భారత అథ్లెటిక్స్ సమాఖ్య. షూటింగ్ విభాగంలో భారత్‌కు నారంగ్ నాలుగు ఒలింపిక్స్ పతకాలు తీసుకొచ్చారు. పతకధారులుగా టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యవహరించనున్నారు. ఈ విషాన్ని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు రాణిస్తారని, దేశానికి పతకాలు తీసుకుస్తారని ఉష ధీమా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు మిషన్ దే చెఫ్‌గా బాక్సర్ మేరీ కోమ్ ఉండేవారు. ఏప్రిల్‌లో మేరీ కోమ్ చెఫ్ దె విషన్ బాధ్యతల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాశారు. తాజాగా ఆమె స్థానంలో గగన్ నారంగ్‌కు అవకాశం వచ్చింది. Also Read:Telangana: టీడీపీని వ్యాప్తి చేయడానికే చంద్రబాబు తెలంగాణ వచ్చారు-విజయశాంతి #pv-sindhu #paris-olympics #shooter-gagan-narang మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి