Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్‌..మనికా బత్రా!

భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్ మనికా బత్రా పారిస్‌ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌ లో టేబుల్‌ టెన్నిస్‌ లో రౌండ్‌ 16 కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డును నెలకొల్పింది.

New Update
Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్‌..మనికా బత్రా!

Paris Olympics: భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్ మనికా బత్రా పారిస్‌ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌ లో టేబుల్‌ టెన్నిస్‌ లో రౌండ్‌ 16 కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డును నెలకొల్పింది. రౌండ్‌ 32లో భాగంగా ఫ్రాన్స్‌ కు చెందిన ప్రపంచ 18 వ ర్యాంక్‌ క్రీడాకారిణి ప్రితికా పవడేతో సోమవారం జరిగిన మ్యాచ్‌ లో 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.

ఆటలో తొలి సెట్‌ నుంచే విశ్వరూపం చూపించిన మనికా ఏ సెట్‌ లో కూడా ప్రితికా కు అవకాశమే ఇవ్వలేదు. తొలి సెట్‌ లో కొంచెం గట్టి పోటీని ఇచ్చినప్పటికీ పెద్దగా తన ప్రతిభను చూపించలేకపోయింది. మనికా అద్భుత ప్రదర్శనతో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా 4-0 తేడాతో ప్రితికాను ఓడిచింది.

మనికా ప్రస్తుతం ప్రపంచ 28 వ ర్యాంకులో ఉండగా..ప్రీ క్వారర్ట్‌ ఫైనల్ లో ఎనిమిదో సీడ్‌ మియూ హిరానో (జపాన్‌) జు చెంగ్జూ (హాంకాంగ్‌ ) తో తలపడనున్నట్లు సమాచారం.

Also read: మను భాకర్ మళ్లీ పిస్టల్‌తో రెడీ.. చరిత్ర సృష్టిస్తుందా? ఈరోజు ఒలింపిక్స్ లో ఈవెంట్స్ ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు