Cricket : పువా న్యూ గినియా క్రికెట్ లో విషాదం!

ప‌పువా న్యూ గినియా ఆల్‌రౌండ‌ర్ కైయా అరుహ‌ (Kaia Arua) క‌న్నుమూసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ అయిన 33 ఏండ్ల వ‌య‌సులో ప్రాణాలు విడిచింది. దాంతో, పువా న్యూ గినియా క్రికెట్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

New Update
Cricket : పువా న్యూ గినియా క్రికెట్ లో విషాదం!

Cricket : ప‌పువా న్యూ గినియా ఆల్‌రౌండ‌ర్ కైయా అరుహ‌(Kaia Arua) క‌న్నుమూసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ అయిన 33 ఏండ్ల వ‌య‌సులో ప్రాణాలు విడిచింది. దాంతో, పువా న్యూ గినియా(Papua New Guinea) క్రికెట్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అయితే.. ఆమె అకాల మ‌ర‌ణానికి(Sudden Death)  కార‌ణం ఏంటి? అనేది మాత్రం తెలియ‌లేదు.

కైయా 2018లో పొట్టి క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. బంగ్లాదేశ్‌పై తొలి మ్యాచ్ ఆడిన ఆమె ఆ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్‌లో కైయా ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు సార‌థిగా ఉంది. అంతేకాదు 2018 ఐసీసీ ఉమెన్స్ గ్లోబల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్క్వాడ్‌(Women's Global Development Squad) లో చోటు ద‌క్కించుకుంది.

తూర్పు ఆసియా ఫ‌సిఫిక్, ఫ‌సిఫిక్ క్రికెట్‌లో భాగ‌మైన కైయా అన‌తికాలంలోనే స్టార్ ప్లేయ‌ర్‌గా ఎదిగింది. ఇష్ట‌మైన ఆట కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. కూతురుని త‌న త‌ల్లిగారి ఇంటివ‌ద్ద ఉంచి చ‌దివించింది. సుదీర్ఘ కెరీర్‌లో కైయా 39 టీ20 మ్యాచుల్లో ప‌పువా న్యూ గినియా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించింది. త‌న బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యంతో 29 మ్యాచుల్లో విజేతగా నిలిపింది. పొట్టి ఫార్మాట్‌లో అద‌ర‌గొట్టిన కైయా 10.2 స‌గ‌టుతో 59 వికెట్టు ప‌డ‌గొట్టింది. దాంతో, ప‌పువా న్యూ గినియా త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన‌ బౌలర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె 4-1-7-5తో అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేసింది. జ‌పాన్ జ‌ట్టుపై ఆమె ఈ ఫీట్ సాధించింది.

Also Read : మయాంక్ పై స్పందించిన ఇంగ్లాడ్ ఫేసర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు