Telangana Politics: శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డు ప్లే చేసినా.. ఏ కార్డు ప్లే చేసినా ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు చేశాడని.. అందుకే కేసు వేశామన్నారు. 

New Update
Telangana Politics: శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అభివృద్ది మాటున అరాచకం జరుగుతుందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు నిశ్చయించుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని ఆయన అన్నారు. సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని.. బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే తెలంగాణను శాసిస్తోందని ఆరోపించారు. బీసీలకు ఆదరణ లేని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు చేశాడని.. అందుకే కేసు వేశామన్నారు.

ప్రజలు మార్పు కావాలంటున్నారు..

ప్రగతి భవన్ కోట తలుపులు తట్టెందుకు కూడా ఎవరికీ అవకాశం లేదన్నారు. ఈటెల రాజేందర్ లాంటి వారికి కూడా అనుమతి లభించని రాచరిక పాలనను చూశామన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరినట్లు స్వయంగా ప్రధాన మంత్రే చెప్పారన్నారు. బీఆర్ఎస్ పాలన ఉన్నన్ని రోజులు కేసీఆర్, తర్వాత కేటీఆర్, హిమన్షు వీళ్ళే ఉంటారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డు ప్లే చేసినా.. ఏ కార్డు ప్లే చేసినా ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..

ఇది కూడా చదవండి: మెడమీద తలకాయ ఉన్నవాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేయరు: బండి సంజయ్

Advertisment
Advertisment
తాజా కథనాలు